ETV Bharat / bharat

ఎగ్జిట్​పోల్స్​ నిజమయ్యేనా..? మరోమారు భాజపానేనా...??

author img

By

Published : Oct 22, 2019, 1:29 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభంజనం అనంతరం... మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు ఎన్నికలు నిన్న ముగిశాయి. మరోసారి రెండు రాష్ట్రాల్లో అధికారం ఎన్డీఏదేనని ఎగ్జిట్​ పోల్స్​ గంటాపథంగా చెబుతున్నాయి. మహారాష్ట్రలో సొంతంగానే భాజపా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సార్వత్రికం సహా... ఇతర ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు నిజమయ్యాయా...? ఓటరు నాడిని పట్టుకోగలిగాయా అనేది ఓసారి పరిశీలిద్దాం...

ఎగ్జిట్​పోల్స్​ నిజమయ్యేనా..? మరోమారు భాజపానేనా...??

ఎన్నికలు ముగిశాక... ఫలితాలు వచ్చే వరకు నాయకులకు కంటి మీద కునుకు ఉండదు. అత్యధికులు ఎగ్జిట్​ పోల్స్​పై ఎనలేని విశ్వసనీయత కనబరుస్తారు. అయితే ఈ ఎగ్జిట్​ పోల్స్​ కొన్ని సార్లు ఓటరు నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి.

మహారాష్ట్ర, హరియాణా విధాన సభ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం పోలింగ్​ ముగిసిన వెంటనే ఎగ్జిట్​ పోల్స్​ ఓటరు నాడిని పట్టాయి. భాజపాకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించాయి. మహారాష్ట్రలో మెజార్టీకి అవసరమైన 145 స్థానాలు... కమలదళమే సొంతంగా గెల్చుకుంటుందని అంచనా వేశాయి సర్వే సంస్థలు.

ఇదీ చూడండి: 'మహా'పోరు: భాజపా-శివసేన కూటమి విజయదుందుభి!

హరియాణాలోనూ భాజపాకు మూడింట రెండొంతులకుపైగా స్థానాలు దక్కొచ్చని... కాంగ్రెస్​కు ఘోరపరాభవం తప్పదని తేల్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సార్వత్రికం సహా... అంతకుముందు ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు ఫలించాయా...? బోల్తాపడ్డాయా...? అనేది చూద్దాం.

2019 సార్వత్రికంలో అంచనాలకు మించి...

2019 సాధారణ ఎన్నికలు ముగిసిన రోజే ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు విడుదలయ్యాయి. రెండోసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోమారు అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి పలు సర్వే సంస్థలు. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్​, నేత న్యూస్​ ఎక్స్​ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్​ చెప్పగా, న్యూస్​ ఎక్స్​ 242 వస్తాయని తెలిపింది.

అయితే... భాజపా ఇంకా అంచనాలకు మించి అధిక స్థానాలతో సొంతంగానే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 కంటే 21 సీట్లు అధికంగా గెలిచి భాజపానే ఆధిపత్యం చెలాయించింది. యూపీఏ 90 సీట్లకే పరిమితమైంది.

2014 ఎగ్జిట్​ పోల్స్​

2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్​ పోల్స్​ను ప్రకటించగా అందులో న్యూస్​-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏకి 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.

ఎగ్జిట్​ పోల్స్​ ఎన్డీఏ యూపీఏ
న్యూస్​ 24 చాణక్య 340 70
ఇండియా టీవీ-సీ ఓటర్​ 289 101
సీఎన్​ఎన్​-ఐబీఎన్​ సీఎస్​డీఎస్ 280 97
ఎన్డీటీవీ 279 103
టైమ్స్​ నౌ-ఓఆర్​జీ 249 148

2004, 2009 విఫలం

2004, 2009 ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయ్యాయి. యూపీఏ, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. రెండు సార్లూ యూపీఏ సునాయాసంగానే అధికారం చేజిక్కించుకుంది.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్​ఆద్మీ, కాంగ్రెస్​ కొదమ సింహాల్లా గర్జించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్​ 40-45 సీట్ల వరకు గెలుస్తుందనుకున్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో... వాటిని తలకిందులు చేస్తూ ఆప్​ 70కి 67 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది.

బిహార్​లోనూ అంతే...

2015 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ భాజపా, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్​ మహాకూటమి మధ్యే. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. ​అయితే ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. ఎన్​డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్​ఎల్​డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్​ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.

ఎగ్జిట్​ పోల్స్​లో గెలిచి.. ఫలితాల్లో ఓడారు..

2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్​ పోల్స్​ కోడై కూశాయి. 543 లోక్​సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్​డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్​ పోల్స్​. ఫలితాల్లో మాత్రం యూపీఏ 218 గెల్చుకుని ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అలా అని నమ్మకుండా ఉండలేం...

ఈ సందర్భాలన్నింటా ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయినంత మాత్రాన మొత్తానికి నమ్మకూడదు అని చెప్పలేం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్​ పోల్స్​ సఫలమయ్యాయి.

అయితే ఈ ఎగ్జిట్​ పోల్స్​ కేవలం కొద్ది శాతం మంది ప్రజల అభిప్రాయ సేకరణ మాత్రమేనన్న విషయాన్ని ఓటర్లు సహా నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేయగలవే గాని ఓటర్ల మనసులో ఏముందో ఏ ఎగ్జిట్​ పోల్స్ చెప్పలేవు.

ఇదీ చూడండి: మరోమారు భాజపానే.. ఎగ్జిట్​పోల్స్​ అంచనా..!

RESTRICTION SUMMARY: MUST CREDIT CTV; NO ACCESS CANADA
SHOTLIST:
++PRELIMINARY SCRIPT MORE TO FOLLOW++
CTV - MUST CREDIT CTV; NO ACCESS CANADA
Burnaby, British Columbia, Canada - 22 October 2019
1. Wide of New Democratic Party victory rally
2. Various of New Democratic leader Jagmeet Singh coming on stage, dancing and thanking his supporters
3. SOUNDBITE (English) Jagmeet Singh, New Democratic leader: ++VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO COME++
4. Singh's supporters cheering
STORYLINE:
Canadian New Democratic leader Jagmeet Singh says he has congratulated Prime Minister Justin Trudeau and will be a "constructive" participant in the new Parliament.
Trudeau's Liberal Party was projected to win the most seats in the 338-seat Parliament in Monday's national elections.
That outcome would give it the best chance to form a government.
Still, the Liberals were poised to fall short of a majority, meaning they will have to rely on an opposition party to stay in power.
Trudeau is expected to rely on the leftist New Democrats for support at times to pass legislation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.