ETV Bharat / bharat

'గుజరాత్​లో 'ఆప్​' మూడో ప్రత్యామ్నాయం'

గుజరాత్​లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. అహ్మదాబాద్​లో రోడ్​షో నిర్వహించారు ఆమ్​ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా. భాజపా, కాంగ్రెస్​లు సోదర పార్టీలని విమర్శించిన ఆయన.. గుజరాత్​కు 'ఆప్' రూపంలో మరో ప్రత్యామ్నయం లభించిందన్నారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'​కు ప్రత్యేక ఇంటర్వ్య ఇచ్చారు సిసోడియా.

Delhi deputy chief minister Manish Sisodia
'గుజరాత్​లో 'ఆప్​' మూడో ప్రత్యామ్నయం'
author img

By

Published : Feb 7, 2021, 9:30 AM IST

Updated : Feb 7, 2021, 10:12 AM IST

గుజరాత్​లో ప్రత్యామ్నాయం ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​)యేనని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా అన్నారు. భాజపా, కాంగ్రెస్​లు సోదర సంస్థల్లాంటివని విమర్శించారు. అందువల్ల మూడో ప్రత్యామ్నాయం తామేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో.. శనివారం అహ్మదాబాద్​లో జరిగిన రోడ్​షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతూ.. ఇంతవరకు గుజరాత్​ ప్రజలు రెండు పార్టీలనే చూశారని, ఇప్పుడు తమ రాకతో ప్రజల్లో ఉత్సాహం నెలకొందన్నారు. గాలి మార్పు కనిపిస్తోందని చెప్పారు.

మనీశ్​ సిసోడియా 'ఈటీవీ భారత్​' ఇంటర్వ్యూ

25 ఏళ్ల భాజపా పాలనలో మంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు లేవని విమర్శించారు సిసోడియా. భాజపా ఇవ్వలేని పాలనను దిల్లీలో చేసి చూపిస్తున్నామని.. అందుకే ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు. వైద్యశాలలు, పాఠశాలల రూపురేఖలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ పూర్తిగా మార్చివేశారని అన్నారు. తాము విజయం సాధిస్తే.. గుజరాత్​లోనూ ఈ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ఇదీ చదవండి: ఆధిపత్యం కోసం మిడిసిపాటు.. మొదటికే చేటు!

Last Updated : Feb 7, 2021, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.