ETV Bharat / bharat

'ఈవీఎం టాంపరింగ్​ అసాధ్యం.. బ్యాలెట్​ ప్రసక్తే లేదు' - 'ఈవీఎం టాంపరింగ్​ అసాధ్యం.. బ్యాలెట్​ ప్రసక్తే లేదు'

ఈవీఎం టాంపరింగ్​పై స్పందించారు ఎన్నికల ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోడా. ఎలక్ట్రానిక్​ ఓటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేయడం అసాధ్యమని పునరుద్ఘాటించారు. ఈవీఎంలు అప్పుడప్పుడు పనిచేయక పోవచ్చేమో గానీ.. టాంపరింగ్​ చేయలేరని తేల్చిచెప్పారు. అందుకే బ్యాలెట్​ పత్రాలతో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అరోడా.

EVMs cannot be tampered with, no question of going back to ballot paper: CEC
'ఈవీఎం టాంపరింగ్​ అసాధ్యం.. బ్యాలెట్​ ప్రసక్తే లేదు'
author img

By

Published : Feb 12, 2020, 6:42 PM IST

Updated : Mar 1, 2020, 2:55 AM IST

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)లను టాంపరింగ్‌ చేయడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నందున మరోసారి బ్యాలెట్‌ పత్రాల జోలికి వెళ్లే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. కారు లేదా పెన్‌ మాదిరిగా ఈవీఎంలు పని చేయకుండా పోవచ్చుగానీ టాంపరింగ్‌ సాధ్యం కాదని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంస్కరణలు, ప్రవర్తనా నియమావళికి సంబంధించి రానున్న కాలంలో రాజకీయ పార్టీలతో ఈసీ సంప్రదింపులు జరుపుతుందని వివరించారు అరోడా. ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాలు సమర్థించిన సంగతిని గుర్తు చేశారు.

ఇదీ చూడండి : అయోధ్య గుడికి బ్రహ్మాండమైన డిజైన్- 19న నిర్ణయం!

Last Updated : Mar 1, 2020, 2:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.