ETV Bharat / bharat

'భయం వద్దు.. దేశంలో సరిపడా నిత్యావసరాలు, ఔషధాలు' - కరోనా లేటెస్ట్ అప్​డేట్

లాక్​డౌన్ సమయంలో నిత్యావసరాలు, ఔషధాల గురించి ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు. దేశ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

amit shah
అమిత్​ షా
author img

By

Published : Apr 14, 2020, 1:26 PM IST

Updated : Apr 14, 2020, 2:23 PM IST

దేశంలో సరిపడా నిత్యావసరాలు, ఔషధాలు ఉన్నాయని స్పష్టంచేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. లౌక్​డౌన్​ను మరో 19 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో ఈమేరకు ప్రకటన చేశారు షా.

saha tweet
అమిత్ షా ట్వీట్​

"దేశంలో సరిపడా ఆహార, ఔషధ, ఇతర నిత్యావసరాల నిల్వలు ఉన్నాయని దేశ హోం మంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. వాటిపై ఎవరూ ఆందోళన చెందొద్దు. సంపన్న వర్గాలు తమ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయాలని కోరుతున్నాను." - అమిత్​ షా,కేంద్ర హోం మంత్రి

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై షా సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంతో కలిసి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. పౌరులెవ్వరూ నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర రక్షణ అధికారుల పాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు అమిత్​ షా. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి సహకారం అందించాలని కోరారు.

ఇదీ చూడండి:మోదీ 'లాక్​డౌన్​ 2.0' స్పీచ్​ హైలైట్స్​

Last Updated : Apr 14, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.