ప్రపంచంలోనే పొడవైన అటల్ టన్నెల్‌ను సందర్శించేలా విద్యార్థులను ప్రొత్సహించాలని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలకు సూచించింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఉత్తమ సాంకేతికతతో నిర్మితమైన, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ టన్నెల్ గురించి విద్యార్థులకు వివరించాలని పేర్కొంది. టన్నెల్ నిర్మాణంలో సాంకేతికత గురించి వివరిస్తూ.. విశ్వవిద్యాలయ ఉపకులపతులకు ఈమేరకు లేఖ రాశారు యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్.
"హిమాచల్ ప్రదేశ్‌లో కఠిన వాతావరణంలో సముద్రతలానికి 10 వేల అడుగుల ఎత్తులో 9.02 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించడం సులువైన పని కాదు. అంతేకాకుండా పర్యవేక్షణ వ్యవస్థ, ఎస్ఓఏడీఏ అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ, పర్యవేక్షణ వ్యవస్థతో సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఉత్తమ పద్ధతిలో నిర్మించారు" అని జైన్ పేర్కొన్నారు.
"ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణాంలో దేశంలోనే ఉత్తమ సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిర్మించిన టన్నెల్. దీని నుంచి అద్భుతం జ్ఞానాన్ని పొందవచ్చు. ప్రాజెక్ట్ నిర్వహణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే ఈ సొరంగాన్ని సందర్శించడానికి ప్రోత్సహించాలి. దేశంలోని సొరంగ మార్గాలు సందర్శించి వాటి సామర్థ్యం తెలుసుకోవడానికి ప్రయత్నించేలా తగిన శిక్షణ ఇవ్వాలి" అని జైన్ పేర్కొన్నారు.
అయితే విద్యార్థులు.. అటల్ టన్నెల్ చూడటానికే వెళ్లిన సమయంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు జారీ చేసిన భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని యూజీసీ ఆదేశించింది.
ఇదీ చూడండి: 'దేశ రక్షణ కోసం రాజీలేని కృషి'