ప్రముఖ పల్మనాలజిస్ట్, దిల్లీ ఎయిమ్స్ మాజీ వైద్య విభాగాధిపతి డా. జితేంద్ర నాథ్ పాండే శనివారం కన్నమూశారు. గతవారం ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. 79 ఏళ్ల పాండే ఆయన నివాసంలో ప్రాణాలు వీడారు.
పాండే భార్యకు కూడా వైరస్ సోకినట్టు మంగళవారం తెలిసింది. అప్పటి నుంచి దంపతులు ఇద్దరు తమ నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే పాండే మృతితో శనివారం ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు.
కరోనాతో పాటు పాండేకు ఇతర వ్యాధులు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.
"వైరస్ పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి.. పాండేను పర్యవేక్షణలో ఉంచాం. ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. తీవ్రమైన గుండె సమస్యతో నిద్రలోనే మరణించి ఉండొచ్చు."
-- డా. గులేరియా, ఎయిమ్స్ డైరక్టర్