ఒడిశాలో మయూర్బంగ్ జిల్లా కరనిజా అటవీ ప్రాంతానికి సమీపంలో గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఏనుగులకు సహజ ఆవాస ప్రాంతం ఈ కరనిజా అడవులు. కానీ గజరాజల సమూహం దారి మళ్లి గిరిజన గ్రామాల వైపు వస్తున్నాయి. ఏనుగుల గుంపు గ్రామాల్లో వీరవిహారం చేస్తూ ఇళ్లు, పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
దాడికి ప్రతిదాడి
గిరిజనులు కూడా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తుంటారు. ఏనుగుల ఘాతుకానికి తట్టుకోలేక వాటిపై ఈటెలు, బాణాలతో దాడికి దిగారు. అందుకు అవి ప్రతిదాడికి దిగడం వల్ల ప్రాణాలు చేతపట్టుకొని పరుగులు తీశారు.
అటవీ నిర్మూలనే కారణం?
ఏనుగుల సహజ ఆవాస ప్రాంతమైన కరనిజా అడవుల్లో మానవ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. స్వార్థపూరిత చర్యలవల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఫలితంగా అవి గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. ఏనుగులపై దాడిచేయడం సరికాదని, తమకు సమాచారం ఇస్తే తిరిగి అడవుల్లోకి మళ్లిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే