ETV Bharat / bharat

సామాన్యుడికి 'కరెంట్'​ షాక్​.. బిల్లు రూ.80 లక్షల కోట్లు!

వేలల్లో విద్యుత్​ బిల్లులు వస్తేనే సామాన్యులు భరించలేరు. అలాంటిది మధ్యప్రదేశ్​లో ఓ గ్రామీణ వినియోగదారునికి ఏకంగా రూ.80 లక్షల కోట్ల విద్యుత్​ బిల్లును వడ్డించింది రాష్ట్ర విద్యుత్​ శాఖ. బిల్లును చూసి షాక్​ అయిన బాధితుడు అధికారులను సంప్రదించగా.. ఎవరూ స్పందించటం లేదని వాపోయాడు.

electricity-department
సామాన్యుడికి 'విద్యుత్'​ షాక్
author img

By

Published : Jun 8, 2020, 9:01 AM IST

సామాన్యులకు రూ.కోట్ల విద్యుత్​ బిల్లులు పంపిన ఉదంతాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్​ విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. సింగ్రౌలీ జిల్లా బైఢన్​ గ్రామంలో ఓ వినియోగదారునికి ఏకంగా భారత జీడీపీలో దాదాపు మూడోవంతు అంటే రూ.80 లక్షల కోట్ల బిల్లును వడ్డించింది.

electricity-department
బిల్లు రూ.80 లక్షల కోట్లు

బిల్లును చూసి షాక్​కు గురైన ఇంటి యజమాని విద్యుత్ సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ స్థాయిలో బిల్లు రావటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిని సవరించి సరైన బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారని వాపోయాడు.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విద్యుత్​ శాఖ నిర్లక్ష్యాన్ని ఎగతాళి చేస్తున్నారు ప్రజలు. లాక్​డౌన్​లో ప్రజలకు విద్యుత్​ బిల్లులలో ఉపశమనం ఇస్తామని, 50 నుంచి 100 రూపాయల మేర వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు విరుద్ధంగా విద్యుత్​ శాఖ కృషిచేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.