ETV Bharat / bharat

ఆ వయసువారికే కరోనా కాటు.. జాగ్రత్త సుమా - corona virus

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తున్న వేళ.. ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి ఎక్కువగా ఎవరిపై ప్రభావం చూపనుందనే సందేహాలు అందరిలో ఉన్నాయి. అంతే కాకుండా వైరస్​ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం.

elders mostly effect with corona virus... said experts
ఆ వయసువారికే కరోనా కాటు.. జాగ్రత్త సుమా
author img

By

Published : Mar 16, 2020, 7:41 AM IST

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం వయోవృద్ధులపై ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకుల విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

  • చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. గుంపులుగా జనాలు ఉండేచోటుకు వెళ్లకుండా ఉండటం మేలు. వీలయినంత మేర బయటకు వెళ్లొద్దు.
  • వృద్ధులను చూసుకునేవారిలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారు, ఆ కుటుంబంలోని మిగతావారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో రెండు వారాలు అంతకు పైగా సరిపడా ఆహార పదార్థాలు, మందులు, వైద్య సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
  • బంధువులు, స్నేహితుల కుటుంబాల్లో ఎవరైనా వ్యాధిగ్రస్థులుంటే అలాంటివారితో కలవకుండా జాగ్రత్త పడాలి.
  • వీలయినంతమేర ప్రయాణాలను మానుకుంటే మేలు. విమాన, నౌకాయానాలైతే అసలు వద్దు. జన సందోహం ఉండే కార్యక్రమాలకు వెళ్లకపోవడమే మేలు.
  • పూర్వంలా లేఖలు రాయడం కూడా మొదలుపెట్టవచ్చు. వాటికి జవాబులు వస్తే చదువుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు.
  • జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం.. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
  • వృద్ధులకు కాలానుగుణంగా జరపాల్సిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తే.. అది ఎంత దూరంలో ఉంది? అక్కడ కరోనా కేసులేమైనా చూస్తున్నారా? వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ ఆరోగ్యం బాగానే ఉంటే ఆ వైద్య పరీక్షలను వాయిదా వేసుకునే విషయమై సంబంధిత వైద్యులను ఫోన్‌ లేదా ఆన్‌లైన్‌లో సంప్రదించాలి.
  • వేరే ప్రాంతాల్లో ఉన్న సన్నిహితులు, బంధువులు, మిత్రులను కలవలేకపోతున్నామన్న ఆవేదనకు లోనుకాకుండా తరచూ వారితో ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్లలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారిని చూసుకుని పలకరించుకోవచ్చు. వీటితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలు పంపుకోవడం వంటివాటి ద్వారా ఒంటరితనం భావన నుంచి బయటపడవచ్చు.
  • ఇళ్లలోని బాల్కనీలు, ప్రాంగణాలు, గదుల్లోనూ నడవడం వంటివి చేస్తుండటం ద్వారా చురుగ్గా ఉండొచ్చు. చిన్నచిన్న ఇంటిపనులు చేసుకోవడం వంటివి చేయొచ్చు. పిల్లలతో కబుర్లు చెప్పడం.. చిన్ననాటి విషయాలు, విజ్ఞానదాయక అంశాలు చెప్పడం చేయాలి.
  • కరోనా సోకనప్పటికీ.. తమకేమైనా అనారోగ్యం వచ్చిందేమోనన్న భావన కొందరిలో ఉంటుంది. ఇలాంటప్పుడు ఆస్పత్రికి వెళ్లకుండా ఫోన్‌ ద్వారా సహాయక కేంద్రాన్ని లేదా వైద్యులను సంప్రదించాలి. కరోనా లక్షణాలేమిటో తెలుసుకోవాలి. తమకున్న అసౌకర్యాలను వారికి వివరించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.