ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఆందోళనలో ఏం చెయ్యాలో తెలియక ప్రాణాలను కోల్పోతుంటారు. కర్ణాటకలో ఓ వృద్ధురాలు ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా సమయస్ఫూర్తితో చావు అంచులకు వెళ్లి తప్పించుకుంది.
మానీబాయి చందర్ అనే వృద్ధురాలు గుల్బర్గా పరిధిలోని తాండాలో నివసిస్తోంది. చితాపూర్ రైల్వేస్టేషన్ నుంచి సమీపంలోనే ఉన్న స్వగ్రామానికి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా.. గూడ్సు రైలు దూసుకొచ్చింది. అంతే ఆమె ఆందోళన చెందకుండా తెలివిని ఉపయోగించింది. రెండు పట్టాల మధ్యలో పడుకొని ప్రాణాలను దక్కించుకుంది. రైలు వెళ్లిపోయిన తర్వాత స్థానికులు వృద్ధురాలిని ప్లాట్ ఫారం మీదకు తీసుకొచ్చారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:దిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం