తమిళనాడు మామల్లపురంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు భేటీ కానున్నారు. వీరికి స్వాగతం పలికేందుకు ఆ ప్రాంతం సుందరంగా ముస్తాబైంది. పంచ రథాస్లోని భారీ ద్వారాన్ని 18 రకాల కూరగాయలు, పండ్లతో వినూత్న రీతిలో అలంకరించారు. ఇందుకోసం ఉద్యానవన శాఖకు చెందిన 200 మంది సిబ్బంది 10 గంటల పాటు శ్రమించారు.
అలంకరణకు ఉపయోగించిన కూరగాయలు, పండ్లను తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. అధిక శాతం కూరగాయలు సహజ సిద్ధంగా సాగు చేసినవని అధికారులు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా తీసుకువచ్చినట్లు చెప్పారు.
మోదీ-జిన్‌పింగ్‌ల సందర్శన సందర్భంగా మహాబలిపురంలోని షోర్ ఆలయ సమీపంలో సంప్రదాయ అరటి చెట్లు నాటారు. ఎరుపు, తెలుపు రంగు గులాబీ పూలతో ఆ ప్రాంతాన్ని అలంకరించారు.
ఇదీ చూడండి: చైనా అధ్యక్షుడి చెన్నై పర్యటన సాగనుంది ఇలా...