ETV Bharat / bharat

'హఫీజ్​ సయీద్​పై పాక్​వి కంటితుడుపు చర్యలు'​ - ఆర్థిక చర్యల కార్యాదళం

ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్​ఏటీఎఫ్​) కీలక భేటీకి ముందు హఫీజ్​ సయీద్​కు జైలు శిక్ష విధించటంపై సందేహాలు వ్యక్తం చేసింది భారత్​. ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న కంటితుడుపు చర్యలుగా పేర్కొంది. హఫీజ్​ను జైలుకు పంపే విషయంలో పాక్​ చిత్తశుద్ధిని చూడాల్సి ఉందని పేర్కొంది.

Hafiz
హఫీజ్​ సయీద్​పై పాక్​వి కంటితుడుపు చర్యలు: భారత్​
author img

By

Published : Feb 13, 2020, 1:13 PM IST

Updated : Mar 1, 2020, 5:11 AM IST

ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్​ ఉద్​ దవా ఉగ్ర సంస్థ అధినేత హఫీజ్​ సయీద్​ను జైలుకు పంపే విషయంలో పాకిస్థాన్​ ఏపాటి చిత్తశుద్ధి కనబరుస్తుందో చూడాలని.. అభిప్రాయం వ్యక్తం చేసింది భారత్. ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్​ఏటీఎఫ్​) సమావేశానికి ముందు కోర్టు తీర్పు వెలువడిన విషయాన్ని అన్ని దేశాలు గుర్తించాలని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎఫ్​ఏటీఎఫ్​​ గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకు చేపట్టిన కంటితుడుపు చర్యలుగా అభివర్ణించాయి.

"ఎఫ్​ఏటీఎఫ్​ సమావేశం నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇది. దీని వెనక ఉన్న చిత్తశుద్ధిని చూడాలి. వారి భూభాగంలోని ఇతర ఉగ్ర సంస్థలు, తీవ్రవాదులపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి." అని పేర్కొన్నాయి అధికార వర్గాలు.

11 ఏళ్ల జైలు శిక్ష..

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్న రెండు కేసుల్లో సయీద్​తో పాటు అతని అనుచరులను దోషులుగా తేల్చింది పాక్​ కోర్టు. రూ.15వేల జరిమానాతో పాటు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే.. కోర్టు తీర్పు ఎఫ్​ఏటీఎఫ్​ సమావేశానికి 4 రోజుల ముందు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఉగ్ర కార్యకలాపాల నిరోధంపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలను సమీక్షించనున్నారు నేతలు. ​ఫిబ్రవరి 2020 నాటికి తీవ్రవాద నిర్మూలనకు సూచించిన చర్యలను అమలు చేయాలని.. లేదంటే కఠిన ఆంక్షలు విధిస్తామని గతేడాది హెచ్చరించింది ఎఫ్​ఏటీఎఫ్​. పాక్​ను గ్రే జాబితాలోనే ఉంచింది.

ఇదీ చూడండి: ఉగ్ర గురువు హఫీజ్​ సయీద్​కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష

Last Updated : Mar 1, 2020, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.