ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ను ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన రెండు కేసుల్లో దోషిగా తేల్చింది పాకిస్థాన్ కోర్టు. ఒక్కో కేసులో ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఏకకాలంలో..
ఒక్కో కేసులో ఐదున్నరేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది. అయితే.. రెండు కేసుల్లో శిక్ష ఏకకాలంలో పూర్తవుతుందని స్పష్టం చేసింది.
డిసెంబర్ 11 నుంచి రోజువారీ విచారణ
పంజాబ్ రాష్ట్ర తీవ్రవాద నిర్మూలన విభాగం ఫిర్యాదుల మేరకు లాహోర్, గుజ్రావాలో నగరాల్లో సయీద్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. కేసులను విచారిస్తున్న తీవ్రవాద వ్యతిరేక కోర్టు(ఏటీసీ).. సయీద్, అతని సన్నిహితులపై డిసెంబర్ 11 నుంచి రోజువారీ విచారణ చేపట్టింది.
సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా ఉగ్రసంస్థను... లష్కరే తోయిబాకు మాతృ సంస్థగా పేర్కొంటారు. 2008లో ముంబయి పేలుళ్లలో 166 మంది ప్రాణాలు బలిగొన్న ఘటనకు ఈ సంస్థ ప్రధాన సూత్రధారి.
ఇదీ చూడండి: భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ భారీ రోడ్ షో