ETV Bharat / bharat

డీకే కుమార్తెపై ఈడీ ప్రశ్నల వర్షం... 7 గంటలు విచారణ

కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే శివకుమార్​ కుమార్తె... ఐశ్వర్యను సుదీర్ఘంగా 7 గంటల పాటు ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్. డీకేపై నమోదైన మనీలాండరింగ్​ కేసు విచారణ నిమిత్తం.. దిల్లీ ఈడీ కార్యాలయం ఎదుట గురువారం హాజరయ్యారు ఐశ్వర్య. ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్​ నేతను దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.

author img

By

Published : Sep 13, 2019, 5:11 AM IST

Updated : Sep 30, 2019, 10:13 AM IST

డీకే కుమార్తెపై ఈడీ ప్రశ్నల వర్షం... 7 గంటలు విచారణ
డీకే కుమార్తెపై ఈడీ ప్రశ్నల వర్షం... 7 గంటలు విచారణ

కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే శివకుమార్​ కుమార్తె ఐశ్వర్యపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే కేసు విచారణ నిమిత్తం.. దిల్లీ ఈడీ కార్యాలయం ఎదుట హాజరయ్యారు ఆయన కుమార్తె.

మనీలాండరింగ్​ నిరోధక చట్టం(పీఎంఎల్​ఏ) కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు అధికారులు. 2017లో తన కుమార్తెతో కలిసి సింగపూర్​ పర్యటనకు వెళ్లినట్లుగా శివకుమార్​ చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించారు. పర్యటనకు సంబంధించిన పత్రాలు, వివరాలను అధికారులకు సమర్పించారు ఐశ్వర్య.

తండ్రి నిర్వహిస్తున్న ఓ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు 22ఏళ్ల ఐశ్వర్య ట్రస్టీగా ఉన్నారు. శివకుమార్‌ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలు ఈడీ దృష్టికి వచ్చాయి. అయితే, తండ్రీ కుమార్తె మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు మనీలాండరింగ్‌ సొమ్ముతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారించినట్టు తెలుస్తోంది.

మళ్లీ దిల్లీ కోర్టుకు...

మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలతో డీకేను సెప్టెంబర్​ 3న అరెస్టు చేసింది ఈడీ. ఆయనకు విధించిన 9 రోజుల కస్టడీ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో డీకేను దిల్లీ కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

Viral Advisory
Thursday 12th September 2019
Clients, please note the following addition to our output.
VIRAL (GOLF): Aged 100, Susan Hosang goes up against 2018 Masters champion Patrick Reed in a 'Beat the Pro' event on day one at the KLM Open in Amsterdam, Netherlands. Already moved.
Regards,
SNTV London
Last Updated : Sep 30, 2019, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.