తబ్లీగీ జమాత్ నేత మౌలానా సాద్ కాందల్వీపై క్రిమినల్ కేసు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). దిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. నగదు అక్రమ చలామణీ (మనీ లాండరింగ్) అభియోగాలను ఆయనపై మోపారు. కాందల్వీకి చెందిన ట్రస్టులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు కాందల్వీ. నిజాముద్దీన్ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించారు. ఫలితంగా కరోనా బారిన పడి పలువురి మృతికి కారణమయ్యారనే కారణంతో.. మార్చి 31న నిజాముద్దీన్ క్రైం బ్రాంచ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.