సమాజ్‌వాదీ నేత, ఉత్తరప్రదేశ్ రాంపుల్ ఎంపీ ఆజాంఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యూపీలో పలు భూముల కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది ఈడీ. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద చర్యలకు ఉపక్రమించింది.
యూపీలో ఆజాంఖాన్‌పై సుమారు 26 పోలీసు కేసులు నమోదయినట్లు ఈసీఐఆర్ (ఈడీ ఎఫ్ఐఆర్)లో ఈడీ పేర్కొంది. బాధితుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నట్లు ఆజాంఖాన్తో పాటు మరి కొంత మందిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చూడండి: కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేపీసీసీ కసరత్తు