వచ్చే ఏడాది తొలినాళ్లలో శాసనసభ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలు (సీఎస్), రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓ)లకు.. బదిలీలపై కీలక సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ జాబితాలో అసోం, కేరళ, తమిళనాడు, బంగాల్, పుదుచ్చేరిలు ఉన్నాయి.
"స్వేచ్ఛాయుతంగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఓటింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలతో నేరుగా అనుబంధం ఉన్న అధికారును బదిలీ చేయాలి. ఆయా అధికారులను వారి సొంత జిల్లాల్లో కానీ, చాలా కాలం నుంచి పని చేసిన ప్రదేశాలలో కానీ పోస్టింగ్ ఇవ్వకూడదు. ఇదే స్థిరమైన విధానాన్ని ఎన్నికల కమిషన్ అనుసరిస్తోంది. "
- కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ
అధికారుల బదిలీలపై సకాలంలో, కఠినమైన నిర్ణయం తీసుకోవాలని, తమ అంగీకారాన్ని తెలపాలని ఎన్నికల కమిషనర్లను ఆదేశించింది ఈసీ.
ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ గడువు 2021 మే-జూన్ మధ్య కాలంలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది ఈసీ.
ఇదీ చూడండి: ఎన్నికల గుర్తుపై హైకోర్టుకు కమల్ హాసన్