ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 3తో ముగియనుంది.
షెడ్యూల్ ప్రకటించిన తక్షణమే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రానుంది. మార్చి నెలాఖర్లో నోటిఫికేషన్ విడుదలై, ఏప్రిల్ మొదటి వారంలో తొలిదశ పోలింగ్ జరిగే అవకాశముంది.
రాష్ట్రాలకూ....
ఎన్నికల సంఘం లోక్‌సభతో పాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో సార్వత్రికంతోటే పోలింగ్ జరగనుంది. జమ్ముకశ్మీర్ ఎన్నికలనూ 'లోక్‌సభ' తో పాటే జరిపే యోచనలోనూ ఉంది ఈసీ.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దయి ఆరు నెలల కాలం 'మే'తో ముగుస్తుంది. లోక్‌సభతో పాటే ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. కాబట్టి జమ్ములోనూ ఎన్నికలు జరిగే అవకాశముంది. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ ప్రకటించనుంది ఈసీ.
జమ్ము అసెంబ్లీ ఆరు సంవత్సరాలు కాలపరిమితి 2021 మార్చి 16తోనే ముగియాల్సింది. భాజపా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీఎఫ్)ల మధ్య విభేదాలతో ముందే అసెంబ్లీ రద్దయింది.
సర్వం సిద్ధం!...
ఎన్నికలకు అవసరమయ్యే ఓటింగ్ యంత్రాలు, పేపర్ ట్రయల్ మెషీన్లను సిద్ధంగా ఉంచింది ఈసీ. 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు సమాయత్తమైంది.
2014 సార్వత్రికానికి మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. ఏప్రిల్- మే నెలల్లో 9 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి దశ ఏప్రిల్ 7న జరగగా, మే 12తో ఎన్నికలు ముగిశాయి. మే 16న ఫలితాలు వెలువడ్డాయి.