ETV Bharat / bharat

అమర్​నాథ్​ యాత్ర ముగిశాకే జమ్ముకశ్మీర్​ ఎన్నికలు - గవర్నర్ పాలన

అమర్​నాథ్​ యాత్ర ముగిసిన తరవాతనే జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటిస్తామని ఈసీ స్పష్టంచేసింది.

అమర్​నాథ్​ యాత్ర తర్వాతే జమ్ముకశ్మీర్​ ఎన్నికల షెడ్యూల్​
author img

By

Published : Jun 4, 2019, 11:38 PM IST

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను అమర్​నాథ్​ యాత్ర పూర్తయిన తరువాతనే ప్రకటిస్తామని ఈసీ మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్​లో ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ ప్యానల్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఈసీ తెలిపింది.

జమ్ముకశ్మీర్​లో పరిస్థితులను ఎన్నికల సంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్​నాథ్​ యాత్ర ముగిసిన తరువాతే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటిస్తామని తెలిపింది. సాధారణంగా అమర్​నాథ్​ యాత్ర మాస శివరాత్రి జూలై 1 నుంచి ఆగష్టు 15 శరవణ పూర్ణిమ వరకు కొనసాగుతుంది.

ఎన్నికైన ప్రభుత్వం లేదు

జమ్ముకశ్మీర్​లో 2018 జూన్​లో పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిన నాటి నుంచి అక్కడ ఎన్నికైన ప్రభుత్వం లేదు. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో గవర్నర్​ పాలన కొనసాగుతోంది. రాజ్యాంగ సవరణ ప్రకారం 2018 డిసెంబర్​ 19 నుంచి ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలన కిందకు వచ్చింది. దీన్ని తాజాగా మరికొంత కాలం పొడిగించే అవకాశముంది.

లోక్​సభతో పాటే నిర్వహించలేం..

ఏప్రిల్​ నెలలో జమ్ముకశ్మీర్​ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సీఈసీని కలిసి, అమర్​నాథ్​ యాత్ర జరిగే సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని తెలిపింది. లోక్​సభ ఎన్నికలు జరిగినపుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేమని ఈసీ అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్​లో ఎన్నికల నిర్వహణకు తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది.

ఏప్రిల్​లో జరిగిన సమావేశంలో ముగ్గురు ప్రత్యేక పర్యవేక్షకులను నియమించింది ఈసీ. లోక్​సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మార్చి 10న లోక్​సభ ఎన్నికలకు షెడ్యూల్​ ప్రకటించిన సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించొద్దని ఈసీ నిర్ణయించింది.

ఇదీ చూడండి: విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించండి: సుప్రీం

Intro:Body:

asas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.