ETV Bharat / bharat

ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు - Gujrat

ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా నగదు, మద్యం రవాణాపై నిఘాను మరింత పెంచింది ఈసీ. ఎన్నికల షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్​ 1 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిసి రూ.1460 కోట్లు విలువచేసే అక్రమ నగదు, మద్యం, మత్తుపదార్థాలను జప్తు చేసింది.

ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు
author img

By

Published : Apr 2, 2019, 8:36 AM IST

ఎన్నికల వేళ అక్రమార్కులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్​ 1 నాటికి దేశవ్యాప్తంగా రూ.1460 కోట్లు విలువచేసే అక్రమ నగదు, మద్యం, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇందులో అత్యధికంగా గుజరాత్​లో రూ.509 కోట్ల నగదు, మరో రూ.500 కోట్లు విలువచేసే మత్తుపదార్థాలను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడు(రూ.208.55 కోట్లు), ఆంధ్రప్రదేశ్​(రూ.158.61 కోట్లు), పంజాబ్​(రూ.144.39 కోట్లు), ఉత్తరప్రదేశ్​(రూ.135.13 కోట్లు) రాష్ట్రాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పట్టుబడ్డ నగదుకు సరైన పత్రాలు చూపితే డబ్బును తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు.

ఈనెల 11న సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్​ జరగనుంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.