ETV Bharat / bharat

'ముంగేర్'​​ హింసపై ఈసీ ఫైర్- ఎస్పీ​పై వేటు

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న బిహార్ ముంగేర్​​లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరగడంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత ఎస్పీ, జిల్లా మేజిస్ట్రేట్​పై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Munger
'ముంగేర్'​​ హింసపై ఈసీ ఆగ్రహం- ఎస్పీ లిపి సింగ్​పై వేటు
author img

By

Published : Oct 29, 2020, 5:00 PM IST

బిహార్‌లోని ముంగేర్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులుగా జిల్లా ఎస్పీ లిపి సింగ్‌, మేజిస్ట్రేట్​ను తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఘటనపై మగద్​ డివిజనల్​ కమిషనర్​ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశించింది. వారంలోపు నివేదికను సమర్పించాలని తెలిపింది.

అయితే గురువారం కూడా ముంగేర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు ఎస్పీ ఆఫీస్​ సహా పోలీస్​ ఔట్​పోస్ట్​ను ధ్వంసం చేశారు. ఎస్​డీఓ కార్యాలయమే లక్ష్యంగా నిరసనకారులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Munger
వాహనాలకు నిప్పు
Munger
పోలీసు స్టేషన్​లో సామగ్రి ధ్వంసం
Munger
ముంగేర్​ ఎస్పీ ఆఫీస్
Munger
నిర్మానుష్యంగా రహదారులు
Munger
కార్యాలయం ధ్వంసం

ముంగేర్​ రాజీవ్​ చౌక్​లో ఆందోళనకారులు టైర్లకు నిప్పంటించారు. ఈ నెల 26న భక్తులపై కాల్పులకు ఆదేశించిన జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో కవాతు నిర్వహించారు.

Munger
పోలీసుల కవాతు

రాజకీయం...

పోలీసుల వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష ఆర్​జేడీ, కాంగ్రెస్..​ ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. భక్తులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని జలియన్​వాలా బాగ్​ ఘటనతో పోల్చింది ఆర్​జేడీ.

నితీశ్​ కుమార్​, సుశీల్​ కుమార్​ మోదీ ప్రభుత్వం సూచనల మేరకే భక్తులపై లాఠీఛార్జీ, కాల్పులు చేసినట్లు కాంగ్రెస్​ ఆరోపించింది. మొత్తం ఘటనకు సీఎం నితీశ్​ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రణ్​దీప్​ సుర్జేవాలా.

ఏం జరిగింది...?

ఈ నెల 26న దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా పోలీసులు, భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జీ చేసి, పరిస్థితులు సద్దుమణగకపోవడం వల్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే వేటుకు గురైన ఎస్పీ లిపి సింగ్ తండ్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ జేడీయూ నేత. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆమె 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.