80ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు.. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇందుకోసం కొత్త సూచనలతో కూడిన లేఖను అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు పంపించింది.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు కావాల్సిన పత్రాలను.. 80ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులకు స్వయంగా బూత్ స్థాయి అధికారే(బీఎల్ఓ) వారి ఇంటికి వెళ్లి అందించనున్నారు.
"వీరు ఒకవేళ పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకుంటే.. బీఎల్ఓ.. ఓటర్ ఇంటి నుంచే 12-డీ పత్రాన్ని సేకరిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన ఐదురోజుల లోపు ఇది జరుగుతుంది. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఈ పత్రాలను అందిస్తారు."
--- ఎన్నికల సంఘం.
పౌర సమాజం, మీడియా నుంచి స్వీకరించిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సూచనలను జారీ చేసింది ఎన్నికల సంఘం. ఇక మీదట జరిగే అన్ని ఎన్నికలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం... ఆయా పత్రాలను డెలివరీ చేసి, తిరిగి తీసుకొచ్చేందుకు.. ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్. ఇందుకు సంబంధించి ముందుగానే ఓ తేదీని చెబుతారు. అయితే ఇతర ఓటర్లతో పోల్చుకుంటే ఈ పోస్ట్ బ్యాలెట్ సదుపాయం భిన్నమైనదని అధికారులు తెలిపారు. పారదర్శకత కోసం పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- బిహార్ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారిగా 'ట్రాన్స్‌జెండర్'