ETV Bharat / bharat

నేడు ఏడో విడత కమాండర్​ స్థాయి చర్చలు

author img

By

Published : Oct 12, 2020, 5:16 AM IST

Updated : Oct 12, 2020, 9:19 AM IST

భారత్​-చైనా మధ్య ఏడో విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి. కీలక ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను సత్వరం, పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని ఈ భేటీలో భారత్​ పట్టుబట్టనుందని అధికావర్గాల సమాచారం. బలగాల ఉపసంహరణకు రోడ్​మ్యాప్​ను ఖరారు చేయటమే ఈ భేటీ ప్రధాన అజెండాగా పేర్కొన్నాయి.

Eastern Ladakh row
కమాండర్​ స్థాయి చర్చలు

తూర్పు లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 7వ విడత కార్ప్స్​​ కమాండర్​ స్థాయి చర్చలు సోమవారం జరగనున్నాయి. ఈ భేటీలో సరిహద్దుల్లో బలగాలను పూర్తిస్థాయిలో, సత్వరం ఉపసంహరించటంపై భారత్​ ఒత్తిడి పెంచనుందని అధికార వర్గాలు తెలిపాయి. అందుకు తగిన వ్యూహాలతో సిద్ధమైనట్లు వెల్లడించాయి.

మధ్యాహ్నం 12 గంటలకు..

భారత్​ వైపు తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి (ఎల్​ఏసీ) చుషుల్​ ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. భారత బృందానికి లేహ్​లోని 14 కార్ఫ్స్​ కమాండర్ లెప్టినెంట్​ జనరల్​ హరిందర్​ సింగ్​ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో లెప్టినెంట్​ జనరల్​ పీజీకే మెనన్​, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పుఆసియా)​ నవీన్​ శ్రీవాస్తవ సహా పలువురు అధికారులు ఉన్నారు. తూర్పు లద్దాఖ్​లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవటానికి రోడ్​మ్యాప్​ ఖరారు చేయటమే ఈ భేటీ ప్రధాన అజెండ అని అధికారవర్గాలు తెలిపాయి.

" అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిస్థాయిలో, సత్వరం ఉపసంహరించుకోవాలని భారత్​ మరోమారు ఒత్తిడి పెంచనుంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి చైనా సైన్యంపై బాధ్యత ఉంది. ఈ చర్చల్లో భాగంగా సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కొనసాగించటం, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు పాల్పడకుండ ఉండేందుకు మరిన్ని చర్యలు చేపట్టటంపై ఇరువైపులా పరిశీలించే అవకాశం ఉంది."

- అధికారవర్గాలు

సీఎస్​జీ భేటీ..

7వ విడత కమాండర్​ స్థాయి చర్చల కోసం ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి జైశంకర్​, జాతీయ భద్రత సలహాదారు అజిత్​ ధోబాల్​, త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, త్రివిద దళాల అధినేతలతో కూడిన చైనా అధ్యయన బృందం(సీఎస్​జీ) గత శుక్రవారం సమావేశమైంది. సైనిక చర్చల్లో భారత్​ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసింది.

చైనా డిమాండ్​ను వ్యతిరేకించటం..

పాంగోంగ్​ సరస్సు వంటి కీలక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణను భారత్​ మొదట ప్రారంభించాలని చైనా డిమాండ్​ చేస్తే.. దానిని భారత్​ తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు అధికావర్గాలు తెలిపాయి. గత కమాండర్​ స్థాయి చర్చల సందర్భంగా పాంగోంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలోని ముఖ్​పారి, రెజాంగ్​ లా, మాగర్​ హిల్​ ప్రాంతాలలోని అనేక వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత దళాలను ఉపసంహరించుకోవాలని చైనా పట్టుబట్టింది.

ఆరో విడత సైనిక స్థాయి చర్చలు సెప్టెంబర్​ 21న జరిగాయి. సరిహద్దులకు అదనపు బలగాలను తరలించకపోవటం, ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలకు దూరంగా ఉండటం, ఉద్రిక్తతలు పెంచే విధంగా ఎలాంటి చర్యలకు పూనుకోకపోవటం వంటి అంశాలపై ఇరుదేశాల అధికారులు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

ఇదీ చూడండి: చైనాతో చర్చలకు ముందు అత్యున్నత స్థాయి సమావేశం

Last Updated : Oct 12, 2020, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.