గుజరాత్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది. రాత్రి 8.13 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) ప్రకటించింది.
ఒక్కసారిగా భూమి కంపించటం వల్ల కచ్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, పటాన్ నగరాల్లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. కచ్ జిల్లా భచావులో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.