లద్దాఖ్‌లోని లేహ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. ఈ ఉదయం 5.13 గంటలకు భూప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే... ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
సెప్టెంబర్ 26న కూడా లద్దాఖ్‌లో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.