ETV Bharat / bharat

అతివల అందానికే కాదు ఆపదలోనూ రక్షించే రింగు - Women protection controllers

మహిళల రక్షణకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెవిరింగులను రూపొందించాడు ఓ యువకుడు. అవి ధరించిన వారు ఆపదలో ఉంటే బ్లూటూత్​ ద్వారా తక్షణమే పోలీసులకు సమాచారాన్ని చేరవేసేలా తయారు చేశాడు. అందంతోపాటు రక్షణ కల్పించే ఆ చెవిరింగుల గురించి తెలుసుకుందాం.

Earrings to protect women from molesters
మహిళలకు మరింత భద్రత కల్పించే చెవిరింగులు
author img

By

Published : Feb 29, 2020, 7:41 AM IST

Updated : Mar 2, 2020, 10:30 PM IST

ఆ చెవిరింగులతో మహిళలకు మరింత భద్రత!

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసికి చెందిన శ్యామ్​ చౌరాశియా మహిళలకు రక్షణ కల్పించే ప్రత్యేక చెవిరింగులను తయారు చేశాడు. ఓ సాఫ్ట్​వేర్​ సంస్థలో శిక్షకుడిగా పనిచేసే ఆయన విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేలా అధునాతన పరికరాలతో వాటిని రూపొందించారు. బ్లూటూత్​ ద్వారా మొబైల్​ ఫోన్​కు అనుసంధానమై.. ఆపద సమయంలో పోలీస్​ కంట్రోల్​ రూమ్​కు కాల్​ చేసుకునేలా చెవిరింగులను తీర్చిదిద్దాడాయన. మరింత ఆపత్కర పరిస్థితుల్లో రక్షణ పొందేందుకు అందులోనే తూటానూ అమర్చడం గమనార్హం.

అందంతో పాటు రక్షణ...

శ్యామ్​ తయారుచేసిన చెవిరింగులు మహిళలకు అందాన్ని చేకూర్చడమే కాకుండా... వేధింపుల సమయంలో ఆత్మరక్షణ సాధనంగా పనిచేస్తాయి. మహిళలు ఆపదలో ఉన్న సమయంలో.. బటన్​ నొక్కితే బ్లూటూత్​ ద్వారా మొబైల్​కు అనుసంధానం అవుతుంది. అప్పుడు చరవాణిలో కనిపించే పోలీస్​ కంట్రోల్​ రూమ్​ నంబర్​కు కాల్ చేయొచ్చు. దీంతో పోలీసులు ఆ లొకేషన్​ను గుర్తించి అక్కడికి చేరుకోవడానికి వీలుంటుంది.

రింగులో అమర్చిన బ్యాటరీ పరికరం ద్వారా అందులో ఉన్న తూటానూ పేల్చవచ్చు. ఖాళీ ప్రదేశాల వైపు మాత్రమే పేలే ఈ బుల్లెట్​ శబ్ధం సుమారుగా కిలోమీటరు మేర వినిపిస్తుంది. తద్వారా బాధితులను రక్షించేందుకు సమీపంలోని వారు కూడా స్పందించడానికి అవకాశముంటుంది.

మహిళల రక్షణ కోసం ఎప్పుడూ తపించే శ్యామ్​... ఇదివరకే లిప్​స్టిక్​, హ్యాండ్​బ్యాగ్​లలో కూడా ఇలాంటి భద్రతా పరికరాలను తయారుచేశాడు.

'నాలుగైదు ఏళ్లుగా ఇలాంటివి తయారు చేసేపనిలోనే ఉన్నా. ఇప్పుడు కొత్తగా ఈ చెవిరింగులను తయారుచేశాను. ఈ రింగులతో బ్లూటూత్​ ద్వారా మొబైల్​కు కనెక్ట్​ చేసుకొని.. పోలీస్​ కంట్రోల్​ రూమ్​కు​ ఫోన్​ చేసుకోవచ్చు. అప్పుడు పోలీసులు బాధితుల ప్రదేశాన్ని గుర్తించి.. అక్కడికి చేరుకునే అవకాశముంటుంది. మరీ అవసరమైతే ఫైరింగ్​ చేయవచ్చు. ఆ బుల్లెట్​ శబ్ధం ద్వారా స్థానికులు స్పందించి ఘటనాస్థలికి చేరుకోవచ్చు.'

- శ్యామ్ చౌరాశియా, సాంకేతిక శిక్షకుడు

స్థానికులు మెప్పు...

శ్యామ్​ సృజనాత్మకతను మెచ్చుకున్న స్థానికులు, విద్యార్థినులు, మహిళలకు ఈ రింగులు ఎంతో రక్షణ కల్పిస్తాయని కొనియాడారు.

ఇదీ చదవండి: నా లవర్​ ఎమోషనల్​గా వాడుకున్నాడు: రష్మి

Last Updated : Mar 2, 2020, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.