తన మాజీ ప్రియుడు అర్హాన్‌ఖాన్ ఎమోషనల్‌గా వాడుకున్నాడని అంటోంది నటి రష్మీ. ఇటీవల హిందీలో ప్రసారమైన 'బిగ్‌బాస్ సీజన్13'లో పాల్గొని ఫైనల్‌కు వెళ్లిన రష్మీ దేశాయ్.. ఆ షో తర్వాత తాను ప్రేమించిన అర్హాన్‌ఖాన్ నుంచి విడిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా రష్మీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
" అర్హాన్‌ఖాన్ కోసమే నేను 'బిగ్‌బాస్' షోలో పాల్గొన్నాను. అయితే ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు తను నా గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. నేను ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో తను నాకు పరిచయమయ్యాడని, నాకు సంబంధించిన అన్ని విషయాలను తనే చూసుకున్నాడని అర్హాన్ 'బిగ్‌బాస్'లో చెప్పాడు. అవి వింటే నాకు నవ్వు వచ్చింది. నిజం చెప్పాలంటే ఒకానొక సమయంలో నేను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ, తన జాలి, దయ మీద నేను బతకలేదు. కొన్ని విషయాల్లో అతనికే నేను ఆసరాగా నిలిచాను. అంతేకాకుండా ఆ షోలో భాగంగా అర్హాన్ గురించి ఎన్నో నమ్మలేని నిజాలు తెలుసుకున్నాను. తనకి అంతకు ముందే పెళ్లి జరిగిందని.. పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ముంబయిలో తనకి రెండు ఇళ్లు కూడా ఉన్నయని తెలిశాయి. అతను ఆ షో నుంచి వైదొలగినప్పటి నుంచి నేటి వరకూ తన గురించి ఎలాంటి ఆరోపణలు నేను చేయలేదు. ఎందుకంటే నా జీవితంలో అతను ముగిసిన అధ్యాయం".
- రష్మీ దేశాయ్, సినీ నటి
ఆ రియాల్టీ షో అయిపోయాక అర్హాన్ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించలేదా? అని అడగ్గా.. "అతడు నాకు చాలాసార్లు మెసేజ్‌లు పెట్టాడు. నాకు కూడా తన నుంచి కొన్ని సమాధానాలు రావాలి. కాబట్టి తప్పకుండా అతన్ని కలుస్తాను. ఎందుకు నన్ను ఎమోషనల్‌గా వాడుకున్నాడో ప్రశ్నించాల్సి ఉంది' అని రష్మీ వివరించింది.