ETV Bharat / bharat

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దసరా శుభాకాంక్షలు - దసరా ఉత్సవాలు

దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. ఇంటివద్దే ఉత్సవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

PM Modi wishes countrymen
దేశ ప్రజలకు ప్రముఖుల దసరా శుభాకాంక్షలు
author img

By

Published : Oct 25, 2020, 10:13 AM IST

కొవిడ్​-19 ఉద్ధృతి నడుమ దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలు. మహానవమి, విజయ దశమిని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు.

'చెడుపై విజయానికి ప్రతీక..'

విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

PM Modi wishes countrymen
రాష్ట్రపతి ట్వీట్​

"దేశ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ సంతోషాలు.. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని, దేశ ప్రజలకు శ్రేయస్సును, సంపదను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. దేశ సాంస్కృతిక ఐకమత్యాన్ని ఈ పండుగ బలోపేతం చేస్తుంది."

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి.

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ..

విజయదశమి(దసరా) పండుగ శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కొవిడ్​-19 మహమ్మారి నేపథ్యంలో దేశ ప్రజలంతా నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఇంటివద్దే పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వివిధ భాషల్లో ట్వీట్లు చేశారు.

PM Modi wishes countrymen
వెంకయ్య నాయుడు ట్వీట్​

ప్రధాని.. మహానవమి శుభాకాంక్షలు..

నవరాత్రి ఉత్సవాల తొమ్మిదవ రోజు మహానవమి, దసరా పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈ పండుగ.. ప్రజలకు స్ఫూర్తిని నింపాలని కోరుకున్నారు.

PM Modi wishes countrymen
మోదీ ట్వీట్​

" మహానవమి సందర్భంగా దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నవరాత్రి పర్వదినాన తొమ్మిదోరోజు దుర్గాదేవి సిద్ధిదాత్రిగా దర్శనమిస్తారు. మాతా సిద్ధిదాత్రి ఆశిస్సులతో ప్రతిఒక్కరు వారి పనుల్లో విజయవంతం కావాలని కోరుకుంటున్నా."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: సకల సృష్టికి మూలం విజయ విలాసిని!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.