బంగాల్ ఉత్తర 24-పరగణాలో బాలికలను లైంగికంగా వేధించాడని ఓ పోలీసు అధికారికి దేహశుద్ధి చేశారు గ్రామస్థులు.
హారువాలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు శుక్రవారం సాయంత్రం పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) అయిన జహంగీర్ హుసేన్ అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. బాలికలను ఎవరూ లేని ఓ తరగతి గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని బాలికలిద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పారు.
విషయం తెలుసుకుని ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. గ్రామస్థుల సాయంతో పోలీసులపై దాడి చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వస్తున్న జనాన్ని చూసి హుసేన్‌కు భయమేసింది. వెంటనే అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అది కుదరనందున ఓ తరగతి గదిలోకి వెళ్లి దాక్కోవాలని చూశాడు. అయితే అప్పటికే పాఠశాల ఆవరణలోకి వచ్చిన గ్రామస్థులు హుసేన్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం తరగతి గదిలో పెట్టి తాళం వేశారు.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని.. హుసేన్‌ను కాపాడింది. జహంగీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..