మండపంలోని అంతర్భాగాన్ని శీశ్ మహల్‌ను తలపించేలా, బయట మాయాపుర్లోని ఇస్కాన్ ఆలయం ప్రతిబింబించేలా తయారుచేశారని తెలిపారు కమిటీ ప్రధాన కార్యదర్శి సజల్ ఘోష్. భక్తులు ఎంతో నిష్ఠతో కొలిచే అమ్మ.. పుత్తడి బొమ్మగా మెరిసిపోతుంటే చూసేందుకు వేలాదిగా జనం పోటెత్తుతున్నారు. వారిని అదుపు చేసేందుకు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరాశక్తికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆశ్వయుజ మాసంలో చల్లని దీవెనల కోసం హిందూజనం తాపత్రయపడుతారు. ఆ జగన్మాతను ప్రసన్నం చేసుకునేందుకు విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.