మహారాష్ట్ర ముంబయిలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ గాలుల ధాటికి ముంబయి విమానాశ్రయంలో ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ఓ ల్యాడర్ ఢీకొట్టింది. ల్యాడర్ ఢీకొట్టిన కారణంగా విమానం రెక్కలు, ఇంజిన్ స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
నిసర్గ తుపాను నుంచి తప్పించుకున్న ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోకి రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 30 నిముషాలపాటు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేశ ఆర్థిక నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.