ETV Bharat / bharat

సజావుగా కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​! - corona vaccine dry run updates

కరోనా వ్యాక్సిన్ డ్రై రన్​ నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో టీకా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దాన్ని ప్రజలకు పంపిణీ చేసేందుకు ఆరోగ్య అధికారులు ఏ మేరకు సన్నద్ధమై ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోనుంది కేంద్రం. కొవిడ్ టీకా నిర్వహణకు ఉపయోగించే కో-విన్​ యాప్​ పనితీరును పరిశీలిస్తోంది.

Dry run of Covid-19 vaccination exercise begins today
కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​ ప్రారంభం
author img

By

Published : Dec 28, 2020, 3:32 PM IST

మరికొద్ది రోజుల్లో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలో టీకా పంపిణీకి అధికారుల సన్నద్ధతను పరిశీలించేందుకు వ్యాక్సిన్​ డ్రై రన్​ను నిర్వహిస్తోంది కేంద్రం. గుజరాత్​, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. రెండు రోజుల పాటు మాక్ డ్రిల్​ జరగనుంది.

పంజాబ్​ లుథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్​లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గుజరాత్​లోని రాజ్​కోట్, గాంధీనగర్ జిల్లాల్లో ఈ మాక్​డ్రిల్ నిర్వహిస్తున్నారు. సోమవారం డ్రై రన్​లో పాల్గొనేవారి వివరాలు నమోదు చేసి కో-విన్​ యాప్​లో అప్​లోడ్​ చేసే ప్రక్రియ మాత్రమే జరుగుతుందని, మంగళవారం 125 మంది లబ్ధిదారులు డ్రై రన్​లో పాల్గొంటారని గాంధీనగర్ మున్సిపల్​ కార్పొరేషన్ వైద్యాధికారి డా.కల్పేష్ గోస్వామి తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కూడా మంగళవారమే ఉంటుందని పేర్కొన్నారు.

డ్రై రన్​లో భాగంగా టీకా పంపిణీకి కేంద్రం ఉపయోగించబోయే కో-విన్ యాప్​ పనితీరును పరిశీలిస్తున్నారు. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు పంపిణీ చేసే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.

కరోనా టీకా అత్యవసర వినియోగానికి సీరం, భారత్​ బయోటెక్​, ఫైజర్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్​ టీకాకు ఈ వారంలో అనుమతులు లభించే అవకాశాలున్నాయి. భారత్ బయోటెక్​ టీకా ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉన్నందున అనుమతికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఫైజర్​ టీకా తుది ఫలితాలకు సంబంధించి కేంద్రం మరింత సమాచారం కోరింది. దీంతో ఆ సంస్థ కేంద్రాన్ని గడువు కోరింది.

ఇదీ చూడండి: నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.