జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు చేపట్టిన నిరసనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెసిడెంట్ వైద్యుల నిరసనలతో దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలూ నిలిచిపోయాయి.
తమ ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎన్నిరోజులైనా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు వైద్యులు. రాజ్యసభలో ఎన్ఎంసీ బిల్లుకు ఆమోదం లభించటం వల్ల ఎయిమ్స్, ఆర్ఎమ్ఎల్, ఫోర్డా, ఉర్డా వైద్య సంఘాలు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించాయి.
ఆందోళనలు విరమించారలి: హర్షవర్ధన్
ఆందోళనలు చేపట్టిన వైద్యులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమావేశమయ్యారు. బిల్లులోని పలు నియమాలపై వైద్యుల్లో నెలకొన్న అపార్థాలను తొలగించామని తెలిపారు.
" జాతీయ వైద్య కమిషన్ బిల్లు దేశం, ప్రజలు, రోగులు, వైద్య విద్యార్థులు, వైద్యుల ప్రయోజనాల నిమిత్తం తీసుకొచ్చినట్లు వివరించాము. వైద్యులు ఆందోళనలు చేయాలని మేము కోరుకోవడం లేదు. వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందరి ప్రయోజనాల నిమిత్తం వెంటనే ఆందోళనలు విరమించాలని కోరాం. "
- హర్షవర్థన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
ఇదీ చూడండి: వైద్యుల సమ్మె ఉద్ధృతం.. అత్యవసర సేవలూ బంద్