ETV Bharat / bharat

కొన ఊపిరితో ఉన్న శిశువుతో బైక్​పై... - ముంబయిలో లాక్ డౌన్

ఊపిరి తీసుకోవటానికి కష్టపడుతున్న నవజాత శిశువును లాక్​డౌన్ సమయంలో తన బైక్​పై ఆసుపత్రికి తీసుకెళ్లి రక్షించాడు ఓ వైద్యుడు. ఈ ఘటన మహారాష్ట్ర అలీబాగ్​లో జరిగింది.

newborn
శిశువు
author img

By

Published : Apr 11, 2020, 4:32 PM IST

వైద్యుడ్ని కనిపించే దైవంగా కొలుస్తారు. ముంబయి సమీపంలోని అలీబాగ్ పట్టణానికి చెందిన వైద్యుడు ఈ విషయాన్ని నిజం చేసి చూపించారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండగా.. లాక్​డౌన్ సమయంలో బైక్​పై పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు రక్షించారు.

అలీబాగ్​కు చెందిన శ్వేత పాటిల్ పురుటి నొప్పులతో దగ్గర్లోని ఓ నర్సింగ్ హోంలో చేరింది. శ్వేత మధుమేహ వ్యాధితో బాధపడుతోంది. ఇదివరకు శ్వేత ఒక బిడ్డకు జన్మనిచ్చినా.. ఆ శిశువు పుట్టిన వెంటనే చనిపోయినట్లు ఆమె భర్త కేతన్ తెలిపాడు.

పిల్లల వైద్యుడి సాయం..

ఈసారి శ్వేతకు డెలివరీ చేసేందుకు ముందుగానే పిల్లల వైద్యుడైన డాక్టర్ రాజేంద్ర చందోర్కడ్​ను సాయం కోరారు నర్సింగ్ హోం గైనకాలజిస్ట్. శ్వేతకు అబ్బాయి పుట్టాడు. 3.1 కిలోల బరువుతో ఆరోగ్యంగానే ఉన్నట్లు రాజేంద్ర గుర్తించారు.

కాసేపటి తర్వాత ఉన్నట్టుండి.. ఆ శిశువు శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. శరీరమంతా నీలంగా మారిపోయింది. డయాగ్నోసిస్ చేసేందుకు పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే లాక్​డౌన్ కారణంగా ఎలాంటి వాహనాలు అందుబాటులో లేవు.

బైక్​పై..

ఈ స్థితిలో తన బైక్ మీద ఆ శిశువును పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లి.. వెంటిలేటర్​పై పెట్టి కృత్రిమ శ్వాస అందించారు. 12 గంటల తర్వాత ఆ బాలుడు సాధారణ స్థితికి వచ్చాడు.

" నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాలుడ్ని పరీక్షించేటప్పుడు నా వేలిని పట్టుకున్నాడు. ఎలాగైనా బాలుడ్ని కాపాడి అతని ప్రాణాలకు భరోసా ఇవ్వాలని అనిపించింది."

- రాజేంద్ర చందోర్కడ్, పిల్లల వైద్యులు

ఇదీ చూడండి: కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.