బిహార్ గయా నగరంలోని 'అనుగ్ర నారాయణ్ మగధ్ వైద్య కళాశాల'(ఏఎన్ఎమ్ఎమ్సీహెచ్)లో అనూహ్య ఘటన జరిగింది. శస్త్రచికిత్స కోసం వచ్చిన రోగిని కంగు తినిపించాడు ఓ వైద్యుడు. రోగి ఒక వ్యాధితో ఆసుపత్రి గడప తొక్కగా మరో రోగానికి శస్త్రచికిత్స చేశాడు.
ఇదీ జరిగింది
గయా జిల్లాలోని పునకాల గ్రామానికి చెందిన భునేశ్వర్ యాదవ్ బుధవారం వరిబీజం(హైడ్రోసీల్) సమస్యతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి తన సమస్య వివరించాడు. కానీ... ఆ డాక్టర్ హైడ్రోసీల్కు బదులు రోగి కుడి కాలుకు శస్త్రచికిత్స చేశాడు. కాలులో ఒక ఇనుప కడ్డీని సైతం అమర్చాడు. అసలు విషయం తెలుసుకుని రోగి కంగుతిన్నాడు.
ఏఎన్ఎమ్ఎమ్సీహెచ్ సూపరింటెండెంట్ విజయ్ కృష్ణప్రసాద్ వైద్యునికి బాసటగా నిలిచారు. భునేశ్వర్ కాలు ఉబ్బినందుకే శస్త్రచికిత్స నిర్వహించి ఉంటారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : గూగుల్‌కు 170 మిలియన్ డాలర్ల భారీ జరిమానా