ETV Bharat / bharat

తొలిసారి ఆ మురికివాడలో కరోనా కేసులు సున్నా! - corona getting controlled in mumbai

దేశంలో కొవిడ్​ వ్యాప్తి తగ్గుతోంది. ముంబయిలోని ధారావిలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు. ప్రస్తుతం ధారావిలో 12 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

dharavi-records-zero-covid-cases-in-last-24-hours
ముంబయి మురికివాడలో కరోనా సున్నా
author img

By

Published : Dec 26, 2020, 9:49 AM IST

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుముఖం పడుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాకపోవడం విశేషం. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించిన తర్వాత ముంబయిలోని ఈ ప్రాంతంలో కొత్త కేసులు నమోదు కాకపోవడం ఇదే ప్రథమం. ధారావిలో తొలి కేసు ఏప్రిల్‌ 1న నమోదైంది. అత్యధిక జనసాంద్రత కలిగిన ధారావిలో ఇప్పటివరకు 3,788 మంది కొవిడ్ బారిన పడినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ధారావిలో ప్రస్తుతం 12 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. వీరిలో ఎనిమిది మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా.. నలుగురు కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

జులై 26న ధారావిలో కేవలం రెండు కేసులు నమోదయ్యాయి. నెలల తర్వాత మళ్లీ పెరిగాయి. తాజాగా ఒక్క కేసూ నమోదు కాలేదు. కరోనా వ్యాప్తి కట్టడిలో ధారావి ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి కట్టడి తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసించింది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ పద్ధతిని అనుసరించి ప్రజల భాగస్వామ్యంతో కరోనాను కట్టడి చేయగలిగినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ముంబయి నగరంలో 596 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,800కి చేరింది. తాజాగా మరో 377 మంది కోలుకోగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ముంబయిలో 2,69,672 మంది కోలుకోగా.. 11,056 మంది మృతి చెందారు. ప్రస్తుతం 8,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి : ఆ రాష్ట్రాల్లో 'కొత్త' వైరస్​ అనుమానిత కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.