ETV Bharat / bharat

దెయ్యాల భయం.. శ్మశానవాటికలో ఉత్సవాలు! - MAharastra today

ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేంత విజ్ఞానం పెరిగినా.. ఆ ఊరు మాత్రం దెయ్యాలు, భూతాలు అనే అపోహలతో భయపడుతోంది. దెయ్యాలు లేవని గ్రామస్థులకు చెప్పేందుకు ఆ ఊర్లోని లింగాయత్​ సంఘం ఓ ఉత్సవాన్ని నిర్వహించింది. గ్రామస్థులంతా ఆ వేడుకల్లో పాల్గొని ఎలాంటి అదృశ్య శక్తులు లేవని.. మూఢ నమ్మకాలను వీడి ఆనందంగా జీవనం సాగించడం ఆరంభించారు.

Devotional ceremony in graveyard to end the superstitions
మూఢనమ్మకాలను తొలగించేందుకు ఉత్సవ వేడుకలు
author img

By

Published : Feb 19, 2020, 10:12 PM IST

Updated : Mar 1, 2020, 9:37 PM IST

దెయ్యాల భయం.. శ్మశానవాటికలో ఉత్సవాలు!

మహారాష్ట్రలో అష్టా గ్రామంలో మూఢ నమ్మకాన్ని తొలగించేందుకు.. ఆ ఊరి లింగాయత్​ సంఘం ముందుకొచ్చింది. మూడురోజుల పాటు ఉత్సవాలను నిర్వహించింది. వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొనగా.. వారిలో దెయ్యాలు ఉన్నాయన్న మూఢనమ్మకాన్ని తొలగించారు.

ఓ వ్యక్తి చొరవతో...

అష్టా గ్రామంలోని శ్మశాన వాటికలో దెయ్యాలు తిరుగుతున్నాయని గ్రామస్థులు నమ్మేవారు. ఆ అపోహను తొలగించేందుకు ప్రకాశ్​ మహాజన్​ అనే వ్యక్తి చొరవచూపారు. ఆయనతోపాటు లింగాయత్​ సంఘం ముందుకు వచ్చి దెయ్యాలు లేవని నిరూపించాలని నిర్ణయించారు. శ్మశానంలో ఉత్సవాన్ని నిర్వహించారు. గ్రామస్థులను అక్కడికి వచ్చేలా చేశారు. మూడురోజుల పాటు వేడుకలను నిర్వహించి వారిలో ఉన్న అపోహను తొలగించారు.

శ్మశాన వాటికలో పాత సమాధులను తొలగించి.. ఓ చిన్న శివాలయాన్ని నిర్మించారు.

"దేవుడి గురించి తెలుసుకోవాలంటే జీవితం ముగిసే ప్రదేశానికి వెళ్లాలి. ఎవరి జీవితమైనా శ్మశాన వాటికలోనే ముగుస్తుంది. అందుకే ఆ భగవంతుడిని ఆరాధించడానికి, జీవితాన్ని స్వీకరించడానికి ఇంతకుమించిన ప్రదేశం మరొకటి లేదు."

- ప్రకాశ్​ మహాజన్​, ఉత్సవ నిర్వాహకుడు

అయితే.. గ్రామంలో శ్మశానవాటిక కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించారని స్థానిక వ్యక్తి వివేక్​ మహాజన్ తెలిపారు. అక్కడే మొక్కలు నాటారు. ఆ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: ప్రకృతిని ఆస్వాదించే పిల్లలకు ఆ లక్షణాలు ఎక్కువే!

Last Updated : Mar 1, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.