తమిళనాడు కంచీపురంలో వరదజపెరుమాళ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం ఒక్క రోజే ఆలయంలోని అత్తివరధర్ విగ్రహాన్ని దాదాపు 95 లక్షల మంది దర్శించుకున్నారు. వీఐపీ దర్శనాన్ని గురువారం మధ్యాహ్నం నిలిపివేశారు. సాధారణ దర్శనం రాత్రి 8 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి ఆలయంలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది.
జన సందోహంతో 45 రోజులుగా ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారమే(46వ రోజు) అత్తివరధర్ దర్శనానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య కోటి దాటుతుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
40 ఏళ్లకు ఒకసారి 46 రోజుల పాటు...
ఈ వరదజపెరుమాళ్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్వామి.. ఆలయంలోని అనంత సరోవరం కోనేరులో విశ్రాంతి తీసుకుంటూ.. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు.
40 ఏళ్లకు ఒక్కసారి 46 రోజుల పాటు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. అందుకే కనులారా చూసి తరించేందుకు భక్తులు తాపత్రయపడుతున్నారు.
ఇదీ చూడండి:- ఓ సామాన్యుడు జాతిపితగా ఎలా మారాడు?