ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ జమ్ములో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. ప్రజలు ఇప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్ము, సాంబా, కతువా, ఉధంపుర్, రియాసి జిల్లాల్లో అధికారిక వెబ్సైట్లను అనుమతిస్తూ 2జీ పోస్ట్‌పెయిడ్ సేవలను పనరుద్ధరించాలని అధికార యంత్రాంగం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులు, హోటళ్లు, రవాణ సంస్థల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను కల్పించింది ప్రభుత్వం. కానీ అవి అనుకున్నంత స్థాయిలో ప్రజలకు చేరువ కావడం లేదని తెలిసింది.
అయితే ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను పునరుద్ధరించినట్టు తెలిపిన యంత్రాంగం... పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ తదితర సేవలను ప్రభుత్వం నిషేధించింది. అయితే జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడి అధికారులు చర్యలకు చేపట్టారు. ఇంటర్నెట్ సేవలను పొందడం పాథమిక హక్కు అని విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!