ETV Bharat / bharat

చైనాకు షాక్​- భారత్ అధీనంలో కీలక ప్రాంతం​ - భారత్​ చైనా సరిహద్దు వివాదం

పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ పరిణామంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భారత్​ పట్టు పెంచుకునే అవకాశం ఉంది.

Indian troops
చైనాకు ఊహించని షాక్​- భారత్ అధీనంలో కీలక ప్రాంతం​
author img

By

Published : Sep 1, 2020, 5:00 PM IST

ఎటు చూసినా కెమెరాలు.. ఎక్కడికక్కడ నిఘా పరికరాలు.. ఇది పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరంలో ఉన్న ఆ పర్వతం పరిస్థితి. అయితే వీటన్నింటినీ దీటుగా ఎదుర్కొని చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) కన్నా ముందే భారత సైన్యం ఆ కీలక పర్వత ప్రాంతాన్ని చేజిక్కించుకుంది.

వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా సైన్యం అత్యాధునిక కెమెరాలను వినియోగించి భారత ఆర్మీ కదలికలను పసిగడుతున్నట్లు తెలుస్తోంది. భారత బలగాలు గస్తీ​ నిర్వించే సమయంలో చైనా జవాన్లు సత్వరమే అప్రమత్తమై, అడ్డుపడటానికి ఈ పరికరాలు సహాయపడుతున్నట్లు తెలిసింది.

అయితే మన ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న ఈ కీలక పర్వత శిఖరంపై పాగా వేసిన వెంటనే భారత బలగాలు కెమెరాలను, నిఘా పరికరాలను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

బుకాయింపు...

భారత్​ ఆక్రమించిన పర్వత ప్రాంతాన్ని తమదిగా చైనా వాదిస్తోంది. అయితే పాంగాంగ్​ దక్షిణ తీర ప్రాంతంపై పట్టు సాధించేందుకు ఈ పర్వత శిఖరం ఉపయోగపడుతుంది. అంతేకాదు చైనా సాయుధ బలగాలను మోహరించిన స్పంగూర్​ గ్యాప్​ ప్రాంతంపైనా నిఘా ఉంచేందుకు ఇది కీలకం కానుంది.

గట్టిగా బదులిస్తాం...

ప్రత్యేక ఆపరేషన్​ దళం, సిక్కు లైట్​ పదాతిదళాలు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. అయితే దీనిపై చైనా ఎలా స్పందించినా దీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

భారీ మోహరింపు...

భారత సైన్యం ఈ ప్రాంతంలో భారీ మోహరింపులు చేస్తోంది. బీఎంపీ పదాతిదళాలు, వివిధ రకాల యుద్ధ ట్యాంకులు సహా సాయుధ దళాలను ఈ ప్రాంతానికి తరలిస్తోంది.

ఎందుకు...?

ఆగస్ట్​ 29-30 అర్ధరాత్రి దొంగదెబ్బ తీసి పాంగాంగ్​ దక్షిణ తీరాన్ని, పర్వత శిఖరాన్ని ఆక్రమించేందుకు చైనా యత్నించింది. ఈ పరిణామాలను ముందే ఊహించిన భారత్​ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. భారత బలగాలను చూసిన చైనా సైన్యం తోకముడిచింది.

జూన్​ 15న గల్వాన్​ లోయలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాక భారత్​-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు ఓవైపు చర్చలు జరుపుతూనే బలగాలను మోహరిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.