మోదీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరో వీడియో విడుదల చేశారు. నోట్ల రద్దు కారణంగా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు.
-
मोदी जी का ‘कैश-मुक्त’ भारत दरअसल ‘मज़दूर-किसान-छोटा व्यापारी’ मुक्त भारत है।
— Rahul Gandhi (@RahulGandhi) September 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
जो पाँसा 8 नवंबर 2016 को फेंका गया था, उसका एक भयानक नतीजा 31 अगस्त 2020 को सामने आया।
GDP में गिरावट के अलावा नोटबंदी ने देश की असंगठित अर्थव्यवस्था को कैसे तोड़ा ये जानने के लिए मेरा वीडियो देखिए। pic.twitter.com/GzovcTXPDv
">मोदी जी का ‘कैश-मुक्त’ भारत दरअसल ‘मज़दूर-किसान-छोटा व्यापारी’ मुक्त भारत है।
— Rahul Gandhi (@RahulGandhi) September 3, 2020
जो पाँसा 8 नवंबर 2016 को फेंका गया था, उसका एक भयानक नतीजा 31 अगस्त 2020 को सामने आया।
GDP में गिरावट के अलावा नोटबंदी ने देश की असंगठित अर्थव्यवस्था को कैसे तोड़ा ये जानने के लिए मेरा वीडियो देखिए। pic.twitter.com/GzovcTXPDvमोदी जी का ‘कैश-मुक्त’ भारत दरअसल ‘मज़दूर-किसान-छोटा व्यापारी’ मुक्त भारत है।
— Rahul Gandhi (@RahulGandhi) September 3, 2020
जो पाँसा 8 नवंबर 2016 को फेंका गया था, उसका एक भयानक नतीजा 31 अगस्त 2020 को सामने आया।
GDP में गिरावट के अलावा नोटबंदी ने देश की असंगठित अर्थव्यवस्था को कैसे तोड़ा ये जानने के लिए मेरा वीडियो देखिए। pic.twitter.com/GzovcTXPDv
"మోదీ నగదు రహిత భారతం.. 'వాస్తవానికి కార్మికుడు, రైతు, చిన్న వ్యాపారవేత్త రహిత భారత్'. 2016 నవంబర్ 8న తీసుకున్న ఈ నిర్ణయాలు 2020 ఆగస్టు 31న భయంకరమైన ఫలితాలు ఇచ్చాయి.
జీడీపీ క్షీణతతో పాటు, దేశంలోని అసంఘటిత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు ఎలా విచ్ఛిన్నం చేసిందో తెలుసుకోవడానికి నా వీడియో చూడండి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రెండు ప్రశ్నలు..
'నోట్ బందీ కీ బాత్' పేరుతో విడుదల చేసిన వీడియోల్లో ఇది రెండోది. ఈ వీడియోలో "రూ.500, రూ.1,000 నోట్లను నిరుపయోగం చేశారు. డబ్బులు జమ చేసేందుకు దేశమంతా బ్యాంకుల ముందు నిలబడింది. కానీ, ఈ నిర్ణయం నల్లధనాన్ని రూపుమాపిందా? పేద ప్రజలకు నోట్ల రద్దుతో చేకూరిన లాభమేంటి? వీటికి సమాధానం.. లేదు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు రాహుల్.
కానీ, ప్రజల సొమ్ముతో 50 మంది పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేశారనీ, ఫలితంగా నోట్ల రద్దుతో సంపన్నులే లాభపడ్డారని ఆరోపించారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు అనేది దేశంలో పేదలు, రైతులు, కార్మికులు, చిన్న దుకాణదారులపై దాడి చేసిందని, భారత అసంఘటిత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు.
ఇదీ చూడండి: నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్ గాంధీ