ETV Bharat / bharat

2021 చివరి నాటికి భారత్​కు ఎస్​-400 క్షిపణి: రష్యా - when will india get s400

భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే అత్యాధునిక ఎస్​-400 క్షిపణి వ్యవస్థ చేరనుంది. రష్యాతో చేసుకున్న ఒప్పందం మేరకు తొలి క్షిపణి వ్యవస్థను 2021 చివరి నాటికి అందిస్తామని తెలిపారు ఆ దేశ రక్షణ రంగ అధికారులు. 2025 నాటికి అన్నింటినీ అప్పగిస్తామని స్పష్టం చేశారు.

S-400 missile systems
2021 చివరి నాటికి భారత్​కు ఎస్​-400 క్షిపణి: రష్యా
author img

By

Published : Feb 6, 2020, 6:04 AM IST

Updated : Feb 29, 2020, 8:53 AM IST

అత్యాధునిక ఎస్​-400 తొలి క్షిపణిని 2021 ఏడాది చివరి నాటికి భారత్​కు అందిస్తామని రష్యా పేర్కొంది. భారత్​కు​ అందించే క్షిపణుల తయారీ ప్రారంభించినట్లు ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరుగుతోన్న డిఫెన్స్​ ఎక్స్​పోకు హాజరైన రష్యా రక్షణ రంగ అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం 2025 నాటికి అన్నింటినీ అందిస్తామని పేర్కొన్నారు.

"ఎస్​-400 క్షిపణుల కొనుగోలు ఒప్పందం ప్రకారమే ప్రక్రియ పూర్తవుతుంది. 2021 చివరి నాటికి తొలి క్షిపణి వ్యవస్థను అందిస్తాం. ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారం గొప్పగా ఉంది. దీనిని మరింత బలపరిచేందుకు కృషి చేస్తాం."

- వ్లాదిమిర్ డ్రోజ్జోవ్, ఎఫ్​ఎస్​ఎంటీసీ డిప్యూటీ డైరెక్టర్​

2018, అక్టోబర్​లో ఒప్పందం..

రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్​-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబర్​లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణులన కొనుగోలు కోసం.. 5 బిలియన్​ డాలర్లను ఖర్చు చేయనుంది భారత్​. ఇప్పటికే గతేడాది 800 మిలియన్​ డాలర్లను రష్యాకు చెల్లించింది.

అత్యాధునిక సాంకేతికత...

ఎస్​-400 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే వ్యవస్థగా పిలుస్తారు. ట్రయాంఫ్​ ఇంటర్​సెప్టర్​ ఆధారిత క్షిపణి వ్యవస్థ.. 400 కిలోమీటర్ల దూరంలోని శుత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.

ఇదీ చూడండి: నూతన భద్రతా సవాళ్ల కోసం.. నవీన సాంకేతిక పరిజ్ఞానం: మోదీ

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.