ETV Bharat / bharat

దిల్లీలో గరిష్ఠ స్థాయిలో కరోనా కేసులు

దిల్లీలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పట్లో పాఠశాలలు పునః ప్రారంభించే ఆలోచన లేదని ప్రభుత్వం తెలిపింది.

Delhi's daily coronavirus infection tally crosses 5,000 for first time
దిల్లీలో గరిష్ఠస్థాయిలో కేసుల నమోదు
author img

By

Published : Oct 28, 2020, 10:41 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో 5,673 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 74 వేలకు చేరింది. మరో నలభై మరణాలు నమోదవడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 6,369కి చేరింది. ప్రస్తుతం 29,378 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇప్పట్లో పాఠశాలలు తెరవం: సిసోడియా

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దిల్లీలో పాఠశాలలు మూసే ఉంటాయని బుధవారం ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనుకూలంగా లేరన్నారు.

స్వచ్ఛంద ప్రాతిపదికన 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్‌ 21 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని మొదట కేజ్రీ ప్రభుత్వం భావించినప్పటికీ, తరవాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఇదీ చూడండి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.