ETV Bharat / bharat

దిల్లీలో శాంతియుత వాతావరణం- పలు చోట్ల నిశ్శబ్దం!

author img

By

Published : Feb 28, 2020, 8:32 PM IST

Updated : Mar 2, 2020, 9:41 PM IST

అల్లర్లు జరిగిన ఈశాన్య దిల్లీలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. చాలా ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారసంస్థలు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. హింసాత్మక ఘటనలపై 123 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. 630 మందిని అరెస్టు చేశారు. అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 43కు పెరిగింది.

delhi
దిల్లీ
దిల్లీలో శాంతియుత వాతావరణం- పలు చోట్ల నిశ్శబ్దం!

దిల్లీలో క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటోంది. దాదాపు వారంరోజుల తర్వాత రోడ్లపై జన సంచారం కనిపిస్తోంది. శుక్రవారం ప్రార్థనలు కావటం వల్ల ముందుజాగ్రత్త చర్యగా అదనపు బలగాలను మోహరించారు. చాలాప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో దాదాపు 7వేల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లోని ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఎలాంటి వదంతులు నమ్మొద్దని, తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

ఈశాన్య దిల్లీలో హింసకు సంబంధించి 123 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 630 మందిని అరెస్టు చేశామని.. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. హింసలో 43 మంది మరణించారని.. 250 మందికి పైగా గాయపడ్డారని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని.. దిల్లీ శాంతిభద్రతల ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ఎన్‌. శ్రీవాస్తవ తెలిపారు.

"కొన్ని గంటల నుంచి దిల్లీలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. గడిచిన కొన్ని రోజుల్లో మేం శాంతి ప్రదర్శనలు నిర్వహించాం. స్థానికులతో మాట్లాడాం. మా పోలీసు అధికారులు స్థానికులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంటోంది. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను నమ్ముతున్నాను. శాంతిని నెలకొల్పే దిశగా అధికారులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ దోపిడి, హత్య, నేరాలకు సంబంధించి వందకుపైగా కేసులు నమోదు చేశాం. క్రైమ్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశాం. జిల్లా పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో పాలుపంచుకుంటున్నారు. కుట్రలు పన్నిన వారిని, హక్కులను హరించిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేందుకు కృషి చేస్తాం. రానున్న రోజుల్లో ఆ దిశగా మేం పని చేస్తాం."

- ఎస్‌. ఎన్‌.శ్రీవాస్తవ, దిల్లీ శాంత్రిభద్రతల ప్రత్యేక కమిషనర్

"డీసీపీతో కలిసి ఈ ప్రాంతమంతా తిరిగి వచ్చాం. అంతా ప్రశాంతంగా ఉంది. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. నిన్నటి నుంచి పోలీసుల మార్చ్ ఫాస్ట్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా మౌజ్‌పుర్‌లో పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉంది. "

-మహ్మద్‌ నదీం, మౌజ్‌పుర్‌ కౌన్సిలర్‌

భయానక వాతావరణం..

అల్లర్లు జరిగిన ప్రాంతాలు విధ్వంసకాండకు సజీవసాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీధులనిండా రాళ్లు, ఇటుక పెళ్లలు, మంటల్లో కాలిపోయిన రిక్షాలు, తోపుడు బండ్లు, వాహనాలు ఇంకా అలాగే దర్శనమిస్తున్నాయి. చాలాప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.

ఫ్యాక్టరీలో సోదాలు..

అల్లర్లపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. చాంద్‌బాగ్‌లోని సస్పెండైన ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ ఫ్యాక్టరీ వద్ద ఫోరెన్సిక్‌ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యతోపాటు ఈ దాడుల్లో తాహీర్ హుస్సేన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

పునరావాస కేంద్రాలు..

ఘర్షణల్లో బాధితులకు తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది దిల్లీ ప్రభుత్వం. వారికి ఆహారం పంపిణీకి తగిన ఏర్పాట్లు కూడా చేశామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాకుండా ఇళ్లు కాలిపోయినవారికి తక్షణ పరిహారంగా రూ.25 వేల నగదు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

గవర్నర్​ పర్యటన..

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మౌజ్‌పుర్ ప్రాంతంలో పర్యటించి స్థానికులకు ధైర్యం చెప్పారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడిన ఆయన.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటించింది. జాఫ్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి అల్లర్ల గురించి ఆరా తీశారు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ.

"కొంత ఉద్రిక్తంగా ఉన్నా.. పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అన్నిచోట్లకు వెళ్లాలనుకున్నాం. కానీ శుక్రవారం ప్రార్థనలు ఉన్నందున పోలీసుల విజ్ఞప్తి మేరకు తిరిగి వెళ్తున్నాం. శనివారం మళ్లీ కలుస్తాం."

- రేఖాశర్మ, ఛైర్‌పర్సన్‌, జాతీయ మహిళా కమిషన్‌

దిల్లీ అల్లర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)తో విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు విచారించింది. ఎన్​ఐఏ దర్యాప్తుపై స్పందనలు తెలపాలని కేంద్ర హోంశాఖ, దిల్లీ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దిల్లీ రహదారులపై నిరసనకారులను తొలగించాలని పిల్​లో పిటిషనర్‌ కోరారు. ఇది సాధారణ నిరసన కాదని, స్వార్థ ప్రయోజనాల కోసమేనని వాదించారు.

ఈశాన్య దిల్లీ హింసాత్మక ఘటనల్లో అరెస్టయిన కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్ బెయిల్ పిటిషన్‌ను దిల్లీ కోర్టు తిరస్కరించింది.

పాఠశాలల పరిశీలన..

అల్లర్ల నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలను శనివారం తెరవనున్నారు. అయితే ప్రధానోపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది.. పాఠశాలలను పరిశీలించేందుకు మాత్రమే వెళ్లనున్నారు.

Last Updated : Mar 2, 2020, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.