ETV Bharat / bharat

'దిల్లీ అల్లర్లు 2 రోజులవి కాదు.. 2 నెలల కుట్ర'

దిల్లీలో జరిగిన అల్లర్లను రాజకీయం చేయాలని కాంగ్రెస్​, ఆప్ చూస్తున్నాయని భాజపా విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. దిల్లీలో నిర్వహించిన ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తర్వాత రెండు నెలలుగా హింసను సృష్టించే ప్రయత్నాలు జరిగాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్​ ఆరోపించారు.

delhi riots
'దిల్లీ అల్లర్లు 2 రోజులవి కాదు.. 2 నెలల కుట్ర'
author img

By

Published : Feb 27, 2020, 5:16 PM IST

Updated : Mar 2, 2020, 6:45 PM IST

'దిల్లీ అల్లర్లు 2 రోజులవి కాదు.. 2 నెలల కుట్ర'

దిల్లీలో అల్లర్లు చెలరేగిన సమయంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన పార్టీలు.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు భాజపా నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్​. ఈశాన్య దిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్​, ఐబీ అధికారి మరణాల పట్ల కాంగ్రెస్​, ఆప్​ ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు.

దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ నేతలు శాంతి కోసం కృషి చేయాల్సింది పోయి.. మతం ప్రాతిపదికన బాధితులను గుర్తిస్తున్నారని జావడేకర్​ విమర్శించారు.

"రెండు రోజుల హింసాత్మక ఘటనల అనంతరం ఈశాన్య దిల్లీలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కుట్రకు కారకులను కచ్చితంగా గుర్తిస్తామన్న విశ్వాసం ఉంది. ఇది రెండు రోజుల్లో చెలరేగిన హింస కాదు. రెండు నెలలుగా ప్రయత్నాలు జరిగాయి. సీఏఏ ఆమోదం పొందిన 3 రోజుల తర్వాత డిసెంబరు 14న రామ్​లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో సోనియా గాంధీ 'ఇస్ పార్​ యా ఉస్​​ పార్​'(తాడో పేడో తేల్చాల్సిందే) అని అన్నారు. వాటి అర్థం ఏంటి? రెచ్చగొట్టడం కాదా?"

-ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి.

కాంగ్రెస్​ నేతలు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు జావడేకర్​. సోనియా చేసిన వ్యాఖ్యల అనంతరం రెండు నెలలుగా దిల్లీలో హింసను సృష్టించే ప్రయత్నాలు జరిగాయన్నారు. దేశ రాజధానిలో శాంతి నెలకొల్పేందుకు భాజపా కృషి చేస్తోందని చెప్పారు జావడేకర్​.

ఇదీ చూడండి: దిల్లీ అల్లర్ల కేసులో ప్రతివాదిగా కేంద్రం

Last Updated : Mar 2, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.