దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. వారిలో 1.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 79 లక్షల మంది మహమ్మారిని జయించారు. అయితే గడిచిన 24 గంటల్లో దిల్లీలో 5,023 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 71మంది కరోనా ధాటికి మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,552కి చేరగా.. మృతుల సంఖ్య 7,060కి పెరిగింది.
- కేరళలో తాజాగా 3,593 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 79,410కి చేరింది.
- బంగాల్లో కొత్తగా 3907 కేసులు నమోదవగా.. 56 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,09,221కి పెరగ్గా.. మృతుల సంఖ్య 7,350గా ఉంది.
- మహారాష్ట్రలో సోమవారం కొత్తగా 3,277 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 17, 23,135కు చేరింది. 20 మరణాలతో ఇప్పటివరకు 45,240మంది ప్రాణాలు కోల్పోయారు.
- హరియాణాలో తాజాగా 2,427 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,85,231కి పెరిగింది. కొత్తగా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,151గా ఉంది.
- రాజస్థాన్లో గడిచిన 24 గంటల్లో 1859 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,13,169కి చేరింది. మహమ్మారి కారణంగా 1998మంది మృతిచెందారు.
ఇదీ చదవండి:బస్సుల్లో అగ్ని ప్రమాదాలకు ఇలా చెక్!