ETV Bharat / bharat

శక్తి స్వరూపిణులకు పురస్కారాల ప్రదానం - president kovind presents awards women

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిల్లీ వేదికగా 'నారీశక్తి పురస్కార్' కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అవార్డులు ప్రదానం చేశారు.

naari shakthi
శక్తి స్వరూపిణులకు పురస్కారాల ప్రదానం
author img

By

Published : Mar 8, 2020, 12:43 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. దిల్లీలో జరిగిన 'నారీశక్తి పురస్కార్' కార్యక్రమంలో నారీమణులకు పురస్కారాలు ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. భారత యుద్ధవిమానాల తొలి మహిళా పైలట్లు మోహనా జితర్వాల్, అవనీ చతుర్వేది, భావనాకాంత్​లకు అవార్డులు అందించారు కోవింద్.

103 ఏళ్ల బామ్మకు..

క్రీడారంగంలో విశేష సేవలు అందించిన 103 ఏళ్ల క్రీడాకారిణి మన్​ కౌర్​ను నారీశక్తి పురస్కారంతో సత్కరించారు కోవింద్. పుట్టగొడుగుల సాగుకు విశేష ప్రచారం కల్పించిన బిహార్​కు చెందిన బీనాదేవికి అవార్డు అందజేశారు. ప్రస్తుతం దౌరీ గ్రామానికి సర్పంచ్​గా పనిచేస్తున్నారు బీనాదేవి.

ఇదీ చూడండి: ఆకాశంలో అగ్గి పిడుగు: 'కవిత'కు వాయుసేన కీలక బాధ్యతలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.