ETV Bharat / bharat

దిల్లీలో డ్రైవర్​పై పోలీసుల 'మూక దాడి'! - Police

దిల్లీలో ఓ వర్గానికి చెందిన వాహన చోదకుడిపై పోలీసులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనను ఖండిస్తూ భాజపా ఎమ్మెల్యే, శిరోమణి అకాలీ దళ్​ సభ్యుడు మంజిం​దర్​ సింగ్ ఆందోళనకు దిగారు. నిరసనలతో దిల్లీ ముఖర్జీ నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉద్రిక్తంగా మారింది.

దిల్లీలో డ్రైవర్​పై పోలీసుల 'మూక దాడి'
author img

By

Published : Jun 17, 2019, 6:40 PM IST

దిల్లీలో డ్రైవర్​పై పోలీసుల 'మూక దాడి'

దేశ రాజధాని దిల్లీలోని ముఖర్జీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓ వర్గానికి చెందిన టెంపో డ్రైవర్​ను పోలీసులు మూకుమ్మడిగా అమానుషంగా లాఠీలతో కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది:-

వాయవ్య దిల్లీలో సరబ్​జీత్​ అనే డ్రైవ్​ చేస్తున్న టెంపోను... పోలీసు వాహనం ఢీకొంది. సరబ్​జీత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఒకదశలో తన వద్ద సంప్రదాయంగా ఉండే కత్తితో పోలీసులను బెదిరించాడు సరబ్​జీత్​. వాగ్వాదం ముగిసింది. ఎవరి దారిన వారు వెళ్తున్నారు.

అప్పుడే మొదలైంది అసలు కథ. ఆ టెంపోను వెంబడించిన పోలీసు వాహనం కాస్త ముందున్న పీఎస్​ సమీపించగానే వాహనాన్ని అడ్డుకుంది. ఒక పోలీసు లోనికి వెళ్లాడు. పీఎస్​ లోంచి పోలీసులు గుంపుగా రోడ్డుపైకి వచ్చేశారు. సరబ్​జీత్​ను చుట్టుముట్టారు. లాఠీలు ఝుళిపించారు. సరబ్​జీత్​తో పాటు అతడి కొడుకును లాఠీలతో చితకబాదారు. సరబ్​జీత్​ ఒంటి నిండా లాఠీల వాతలు పడ్డాయి.

"మేం ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాం. వెనుక నుంచి పోలీసు వాహనం వచ్చి ఢీకొట్టింది. అందులో నుంచి ఒక పోలీసు బయటకు వచ్చాడు. అసభ్య పదజాలంతో లాఠీ పట్టుకుని మావైపు వచ్చాడు. మమ్మల్ని కొట్టబోయాడు. అప్పుడు నా కొడుకు చేతులు జోడించి ప్రార్థిస్తే... ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మేమూ వచ్చేశాం. కానీ పోలీసు స్టేషన్​ పరిసరాల్లో మమ్మల్ని అదే పోలీసు వాహనం అడ్డుకుంది. లాఠీ తీసుకుని కోపంతో మళ్లీ మా వైపు వచ్చాడు. కొద్దిసేపటికే పక్కనే ఉన్న పోలీస్​ స్టేషన్​ లోపలికి వెళ్లాడు. స్టేషన్​లో ఉన్న పోలీసులందరూ లాఠీలు పట్టుకుని మాపై దాడి చేశారు."
--- సరబ్​జీత్​ సింగ్​, డ్రైవర్​.

తనపై దాడి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశాడు సరబ్​జీత్​.
ఈ ఘర్షణలో ఒక పోలీసు గాయపడ్డాడు.

రాజకీయ రగడ:-

ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. సరబ్​జీత్​పై దాడి చేసి, ఓ వర్గాన్ని అవమానించారని ఆరోపించారు భాజపా ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్​ సభ్యుడు మంజిం​దర్​ సింగ్​. ఆందోళనలతో ముఖర్జీ నగర్​ పోలీస్ స్టేషన్​ పరిసరాల్లో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్​ ఎదుట బైఠాయించారు భాజపా ఎమ్మెల్యే. ఈ ఘటనతో సంబంధం ఉన్న పోలీసులను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్​ చేశారు.

కేజ్రీవాల్​ స్పందన...

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవల్​ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్నారు. హోంమంత్రి స్పందించి బాధ్యులైన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

హోంశాఖ స్పందన...

దాడి వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని దిల్లీ పోలీస్​ కమిషనర్​ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.