ETV Bharat / bharat

దేశ రాజధానికి భారీ భూకంప ముప్పు! - దిల్లీలో భూకంపం

దేశరాజధానిలో వరుసగా సంభవిస్తోన్న భూప్రకంపనలు భారీ భూకంపాన్ని సూచిస్తున్నాయా? అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రాంతంలో పీడన శక్తి పెరుగుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలుగా తెలిపారు. ఇప్పటివరకు తక్కువస్థాయి ప్రకంపనలే సంభవించినా భారీ ఎత్తున వచ్చేందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేమని వాడియా ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.

Delhi-NCR
దేశ రాజధానికి భారీ భూకంప ముప్పు
author img

By

Published : Jun 20, 2020, 7:05 AM IST

దేశ రాజధాని ప్రాంతానికి భారీ భూకంప ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ హెచ్చరించింది. గత మే 29 నుంచి ఇప్పటివరకూ దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోటుచేసుకున్న 14 భూప్రకంపనలు అసాధారణమేమీ కాదని, ఈ ప్రాంతంలో పీడనశక్తి పెరుగుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలని పేర్కొంది.

"దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతం అత్యధిక ప్రమాద తీవ్రత ఉన్న నాలుగో జోన్‌లో ఉంది. ఈ ప్రాంతాలు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటాయి. స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఇవేమీ పెద్ద భూకంపానికి సంకేతం కాదు. ఇటీవల దిల్లీ రాజధాని ప్రాంతంలో సంభవించిన వాటిల్లో మే 29న రోహ్‌తక్‌లో 4.6 తీవ్రతతో వచ్చిన ప్రకంపనమే పెద్దది. ఈ ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే భారీ భూకంప ముప్పును కొట్టిపారేయలేం. భూకంప అంచనా వ్యవస్థ లేదు కాబట్టి... ఇప్పటివరకూ ఉన్న ప్రకంపనలను భారీ భూకంప సంకేతంగా చెప్పలేం."

- డాక్టర్‌ కలాచంద్‌ సైన్‌, వీఐహెచ్​జీ డైరెక్టర్​

ఈ ప్రాంతంలో ఎందుకొస్తున్నాయి?

భూగర్భ రాతి ఫలకల్లో ఉన్న పీడనశక్తి (స్ట్రెయిన్‌ ఎనర్జీ) విడుదల కావడం వల్లే దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో తరచూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరదిశన ఇండియన్‌ ప్లేట్‌ కదలడంతోపాటు, యూరాసియన్‌ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల... బలహీనమైన జోన్లలోని రాతినెర్రెల ద్వారా పోగైన శక్తి విడుదలై ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దిల్లీ రాజధాని ప్రాంతంలోని దిల్లీ-హరిద్వార్‌ కొండ ప్రాంతం, మహేంద్రగఢ్‌-దెహ్రాదూన్‌, మురాదాబాద్‌, సోహ్నా, గ్రేట్‌బౌండ్రీ, దిల్లీ-షార్గోఢా, యమున, గంగానదీ ప్రవాహ ప్రాంతం బలహీనమైన జోన్ల పరిధిలోకి వస్తాయి.

హిమాలయాల అడుగుభాగంలో ఇండియన్‌ ప్లేట్‌, యూరేషియన్‌ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల పీడనశక్తి కేంద్రీకృతమవుతోంది. ఆ శక్తి బలహీనమైన జోన్ల ద్వారా విడుదల కావడం వల్ల... అక్కడి రాతిపొరల్లో సూక్ష్మ (3.0లోపు), చిన్న (3-3.9లోపు), తేలిక (4-4.9లోపు), ఓ మోస్తరు (5-5.9లోపు), బలమైన (6-6.9లోపు), తీవ్రమైన (7-7.9లోపు), భారీ (8పైన) ప్రకంపనలు వచ్చే అవకాశముంది.

ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చింది?

దిల్లీలో 1720లో 6.5 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చింది. 1803లో మథురలో 6.8%, 1842లో మథురకు సమీపంలో 5.5, 1956లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 6.7, 1960లో దిల్లీకి ఆనుకొని ఉండే ఫరీదాబాద్‌లో 6, 1966లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ సమీపంలో 5.8 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

దిల్లీ-ఎన్సీఆర్‌ నుంచి హిమాలయాల మధ్యలో కూడా చాలాసార్లు వచ్చాయి. 1905లో కంగ్రా (7.8), 1934లో బిహార్‌-నేపాల్‌ (8), 1950లో అసోం (8.6), 2005లో ముజఫరాబాద్‌ (6.7), 2015లో నేపాల్‌ (7.8)లో భారీ భూకంపాలు సంభవించాయి. ఇండియన్‌ ప్లేట్‌ నుంచి హిమాలయన్‌ భూ ఊపరితలం కింద ఉన్న రాతిపొరలు జారిపోవడమే ఇందుకు కారణం.

ఏం చేయాలి?

దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉపరితల నిర్మాణాలు, జియోమెట్రీ, కొండ ప్రాంతాలు, భూగర్భ రాతిపొరల్లోని లోపాలపై జియో సైంటిఫిక్‌ అధ్యయనం చేపట్టాలి. నేల పటుత్వాన్ని తెలుసుకోవాలి. భూగర్భ లోపాలున్నచోట్ల నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ విషయంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ మార్గదర్శకాలను అనుసరించాలి.

హిమాలయ, దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతాలకు భారీ భూకంప ముప్పుంది. ముందు జాగ్రత్తలతోనే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకోగలం. ఏటా ప్రజల భాగస్వామ్యంతో మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహించాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.