నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా దిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. కేంద్రం పిటిషన్‌పై శనివారం, ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ఈనెల2న తీర్పును రిజర్వ్ చేసింది.
దోషుల క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్ కోర్టు జనవరి 31న స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాయి.